
హార్దిక్ ఔట్.. అయ్యర్ ఇన్!
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా యూఏఈ గడ్డపై ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. అటు బ్యాటింగ్‌లోను దారుణంగా విఫలమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌లో మ్యాచ్‌లో రాణించి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన అతను తర్వాతి మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. యూఏఈ గడ్డపై 5 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. 3, 40 నాటౌట్, 17, 5 నాటౌట్, 10 వరుసగా విఫలమయ్యాడు. గాయం కారణంగా బౌలింగే చేయలేదు. ప్రస్తుతం అతని గాయాన్ని డాక్టర్లు, ఫిజియో పర్యవేక్షిస్తున్నారని, ఇప్పటికైతే ఒక్క బంతి కూడా బౌలింగ్ చేయలేదని సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు. దాంతో అతన్ని పక్కనపెట్టే అవకాశాలున్నాయి. అదే జరిగితే కోల్‌కతా తరఫున అదరగొడుతున్న ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ సెకండాఫ్‌లో జట్టులోకి వచ్చిన అయ్యర్ 7 మ్యాచ్‌ల్లో 239 పరగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీశాడు. అయితే పెద్దగా అనుభవం లేకపోవడం ఈ యువ క్రికెటర్‌కు ప్రతికూలంగా మారనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దూల్ ఠాకూర్‌కు హార్దిక్ ప్లేస్‌లో చోటు దక్కే అవకాశం కూడా ఉంది.

చాహర్ ఔట్.. చాహల్ ఇన్!
భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ ఐపీఎల్‌లో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్ స్నిన్నర్ రాహుల్ చాహర్.. శ్రీలంక పర్యటనలోను సత్తా చాటాడు. ఆ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. కానీ యూఏఈ వేదికగా సెకండాఫ్‌లో దారుణంగా విఫలయ్యాడు. సెకండాఫ్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ చాహర్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అంతేకాకుండా ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. మరో వైపు యుజ్వేంద్ర చాహల్ యూఏఈ గడ్డపై దుమ్మురేపాడు. ఏడు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముంబైపై(3/11), పంజాబ్ కింగ్స్(3/29)పై మూడేసి వికెట్లతో చెలరేగాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ కెప్టెన్ కోహ్లీకి అండగా నిలిచాడు. తన ఆటతోనే సెలెక్టర్లు, విమర్శకులకు బదులిచ్చాడు. దాంతో రాహుల్ చాహర్ స్థానంలో చాహల్‌ను తీసుకోవడం ఖాయమైనట్లు తెలుస్తోంది. మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ గాయంతో బాధపడుతుండటంతో చాహల్ జట్టులో ఉండటం కీలకమని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.

భువనేశ్వర్ కుమార్ డౌట్..
ఇక వేలిగాయంతో బాధపడుతున్న భువనేశ్వర్ కుమార్‌ను కొనసాగించడంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అతను కూడా సెకండాఫ్ లీగ్‌లో పెద్దగా రాణించింది లేదు. అతని ప్లేస్‌లో ఇతర బౌలర్‌ను తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి. భువనేశ్వర్ కుమార్ సెకండాఫ్ లీగ్‌లో 6 మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు మాత్రమే తీసాడు. ఆరంభంలో పరుగులిచ్చినా.. చివర్లో కట్టడిగా బౌలింగ్ చేస్తూ ఫామ్ అందుకున్నాడు. ఇంతలోనే వేలిగాయానికి గురయ్యాడు. ఇక ఇషాన్ కిషన్ కూడా ఫామ్‌లేమితో ఇబ్బందులు పడినా.. చివరి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం ఫామ్‌లేమితో ఇబ్బంది పడినా టచ్‌లోకి వచ్చాడు. కాబట్టి ఈ ఇద్దరి స్టానాలకు వచ్చే ముప్పేం లేదు.

భారత టీ20 ప్రపంచకప్ రివైజ్డ్ టీమ్:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్/ వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్స్: శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్


Click it and Unblock the Notifications












