న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ కీలక భేటీ.. టీ20 ప్రపంచకప్‌పై నిర్ణయం నేడే.. ఐపీఎల్‌కు లైన్‌ క్లియర్‌?!!

T20 World Cup decision caught in ICC election crossfire, IPL can be held in that window

న్యూఢిల్లీ: క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్‌ భవితవ్యం బుధవారం తేలనుంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో మెగా టోర్నీ జరుగుతుందా లేదా అన్న సందిగ్ధతకు ఈ రోజు జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో తెరపడే అవకాశముంది. దీంతో పాటు ఐసీసీ మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోనుంది.

సర్వత్రా ఆసక్తి:

సర్వత్రా ఆసక్తి:

షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది. అయితే వైరస్ వ్యాప్తితో విశ్వకప్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ప్రపంచకప్‌ నిర్వహణతో పాటు ఐసీసీ చైర్మన్‌ ఎన్నికలు, ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ)లో మార్పులు, పన్ను మినహాయింపుతో పాటు లీకేజీలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

ఐపీఎల్‌కు లైన్‌ క్లియర్:

ఐపీఎల్‌కు లైన్‌ క్లియర్:

పొట్టి ప్రపంచకప్‌ను ఐసీసీ బోర్డు వాయిదా వేయడం లాంఛనమేనని భావిస్తున్నారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కూడా టోర్నీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది. ఎందుకంటే అక్టోబరు-నవంబరు నెలల్లో జరగాల్సిన ప్రపంచకప్‌ వాయిదా పడితే.. ఐపీఎల్ 2020కి మార్గం సుగమమవుతుంది. అయితే ఈ ఏడాది ప్రపంచకప్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడితే.. 2021లో పొట్టి ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వాల్సిన భారత్‌.. దాన్ని 2022కు వాయిదా వేయడానికి అంగీకరిస్తుందా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న.

ఐసీసీ ముందు మూడు అంశాలు:

ఐసీసీ ముందు మూడు అంశాలు:

అయితే టోర్నీ నిర్వహించడానికి ఐసీసీ ముందు మూడు అంశాలు ఉన్నాయి. షెడ్యూలు ప్రకారం 2021లో భారత్‌ టీ20 ప్రంపచకప్‌కు ఆతిథ్యమివ్వాలి, తన టోర్నీని ఆసీస్‌ 2022లో నిర్వహించాలి లేదా ఆసీస్‌ 2021కి, భారత్‌ 2022కు మారాలి. ఏ నిర్ణయమైనా సభ్య దేశాల ద్వైపాక్షిక క్రికెట్‌ ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాలి. ఇందులో ఏ నిర్ణయమయినా ఈ రోజు తేలనుంది.

కొత్త ఛైర్మన్‌ రేసులో గంగూలీ:

కొత్త ఛైర్మన్‌ రేసులో గంగూలీ:

ఇక ఛైర్మన్‌ పదవి నుంచి దిగిపోతున్న శశాంక్‌ మనోహర్‌.. ఐసీసీ సమావేశంలో కొత్త ఛైర్మన్‌ ఎన్నిక కోసం నామినేషన్‌ ప్రక్రియను ప్రకటిస్తాడో లేదో చూడాలి. ఇంగ్లండ్‌కు చెందిన కొలిన్‌ గ్రోవర్‌ అధ్యక్షుడవుతాడని మొన్నటి వరకు అంతా భావించినా.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌.. దాదా అయితేనే ఆ పదవికి న్యాయం చేకూరుతుందని వ్యాఖ్యానించడంతో సీన్‌ మారిపోయింది. దీంతో ఇప్పుడు గంగూలీ పేరు బలంగా వినిపిస్తోంది. ఐసీసీలో మొత్తం 17 ఓట్లు ఉండగా.. అందులో టెస్టు క్రికెట్‌ ఆడే మెజార్టీ దేశాలు భారత్‌కే మద్దతు తెలుపుతాయనేది నిర్వివాదాంశం.

‌స్టోక్స్‌కు కాదు.. జోస్ బట్లర్‌కు జట్టు పగ్గాలందించాలి: పీటర్సన్

Story first published: Wednesday, June 10, 2020, 7:14 [IST]
Other articles published on Jun 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X