Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Colin Munro:కివీస్ క్రికెట్‌లో వివాదం.. తెలియకుండానే కెరీర్ ముగుస్తుందన్న విధ్వంసకర ఓపెనర్!

 T20 World Cup: Colin Munro Is Heartbroken After Being Left Out Of New Zealands squad

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత క్రమశిక్షణ కలిగిన టీమ్ ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్ జట్టే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో వారు ప్రవర్తించే తీరు.. ప్రత్యర్థికిచ్చే గౌరవం వారికి ఈ గౌరవాన్ని కట్టిపెట్టాయి. అసంబద్దమైన నిబంధనలతో ప్రపంచకప్ చేజారినా ఆ జట్టు గీత ధాటలేదు. ఎవరిని విమర్శించలేదు. తమ తలరాత ఇంతేనని సర్దుకొని ప్రత్యర్థికి అభినందనలు తెలిపింది. అలాంటి జట్టులో ఫస్ట్ టైమ్ వివాదం చెలరేగింది.

ఓ ఆటగాడు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన కెరీరే ముగిసిపోయిందనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే కొలిన్ మున్రో.. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్.

ఈ ఏడాది నవంబర్‌లో యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో కొలిన్ మున్రోకు అవకాశం దక్కలేదు. అలాగే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగే ఫిన్ అలెన్‌, సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్‌టేల్‌కు చాన్స్ ఇవ్వలేదు. అయితే తనకు చోటు దక్కకపోవడంపై కొలిన్ మున్రో సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదంటే.. తనకు తెలియకుండానే తన కెరీర్ ముగిసినట్లనిపిస్తుందని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

 T20 World Cup: Colin Munro Is Heartbroken After Being Left Out Of New Zealands squad

టీ20 ప్రపంచకప్ ఆడటం లక్ష్యంగా పెట్టుకున్నా నాకు జట్టులో చోటు దక్కకపోవడం బాధగా ఉంది. బ్లాక్ క్యాప్స్ తరఫున నాకు తెలియకుండానే చివరి మ్యాచ్ ఆడినట్లనిపిస్తుంది'అని ఇన్‌స్టా స్టోరీలో కొలిన్ మున్రో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక అభిమానులు సైతం కొలిన్ మున్రోకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ బెస్ట్ టీ20 బెస్ట్ బ్యాట్స్‌మన్ అయిన కొలిన్ మున్రోకు అవకాశం ఇవ్వరా? అని నిలదీస్తున్నారు. తనదైన రోజు మున్రో విధ్వంసను అడ్డుకోవడం ఎవరి తరం కాదని గుర్తు చేసుకున్నారు. మార్టిన్ గప్టిల్ కంటే ఎన్నో రెట్లు నయమంటున్నారు. ఇటీవ డెవాన్ కాన్వే అద్భుతంగా రాణిస్తుండటంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మున్రోకు ఉద్వాసన పలికింది.

ఇక న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. మున్రో టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడని, కానీ అంతకు ముందు జరిగే సిరీస్‌లకు అతనికి విశ్రాంతి ఇచ్చామని తెలిపాడు. 'కొలిన్ మున్రోకు అప్పుడే ప్రపంచకప్ అవకాశాలు మూసుకుపోలేదు. ఇంకా చాన్స్ ఉంది. అతను ఎలాంటి ఆటగాడో మాకు తెలుసు. గత ఆరు నెలలుగా మా టీ20 జట్టు అద్భుతంగా రాణిస్తుంది. ఆటగాళ్లు మంచి ప్రదర్శన కన బరుస్తున్నారు. ఎంపికచేయకపోవడంపై గల కారణాన్ని మున్రోకు వివరించాను.'అని తెలిపాడు.

న్యూజిలాండ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), టాడ్‌ ఆస్టల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, మార్క్‌ చాప్‌మన్‌, డేవాన్‌ కాన్వే, ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్టిల్‌, కైల్‌ జేమీసన్‌, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్‌, మిచెల్‌ సాట్నర్‌, టిమ్‌ సీఫెర్ట్‌(వికెట్‌ కీపర్‌), ఐష్‌ సోధి, టిమ్‌ సౌథీ, అడమ్‌ మిల్నే(ఇంజ్యూరీ కవర్‌)

Story first published: Tuesday, August 10, 2021, 14:03 [IST]
Other articles published on Aug 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+