For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup: భారత జట్టులో మార్పులు..? ఆ నలుగురు ముంబై ఆటగాళ్లపై వేటు?

T20 World Cup: BCCI concerned about Mumbai Indians trio’s form in IPL 2021

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టుకు ఎంపిక చేసిన కొందరి ఆటగాళ్ల నిలకడలేమి ఫామ్ ఇప్పుడు అందర్నీ కలవరపెడుతుంది. యూఏఈ గడ్డపైనే జరుగుతున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్‌ లీగ్‌లో ప్రపంచకప్ ఎంపికైన ఓ ఐదుగురు ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ముగియగా.. ఒక్కటి చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా చేయలేదు. ఈ జాబితాలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలతో సహా సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్‌లు ఉన్నారు.

నలుగురిపై వేటు..

నలుగురిపై వేటు..

ఇందులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్‌ కిషన్‌ 11, 14, 9 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. ఇక నిలకడకు మారుపేరైన సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం 3, 5, 8 తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను కాదని జట్టులో చోటు దక్కించుకున్న రాహుల్ చాహర్ కూడా విఫలయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి మూడు పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ కూడా చేయలేదు.

భువీ సైతం..

భువీ సైతం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ అయిన భువనేశ్వర్ కుమార్ కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసాడు. అంతేకాకుండా ధారళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. డెత్ ఓవర్లలో కట్టడి చేయలేకపోతున్నాడు. దీంతో ఈ ఐదుగరు ఆటగాళ్ల ఎంపికపై బీసీసీఐ, సెలెక్టర్లు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఫామ్‌లో లేని వీరిని తప్పించి ఐపీఎల్‌లో రాణిస్తున్న శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్‌లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

ఆడకపోతే అంతే..?

ఆడకపోతే అంతే..?

టీ20 ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసేందుకు అక్టోబర్ 10 వరకు ఐసీసీ గడువు విధించడంతో ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన అనంతరం జట్టులో మార్పులు చేసేందుకు బీసీసీఐ సమాలోచనలు చేస్తుందని ఆ అధికారి తెలిపారు. ప్ర‌స్తుతం ఈ ఐదుగురి ఫామ్ ఆందోళ‌న‌క‌రంగానే ఉన్న‌ప్పటికీ.. మ‌రో 12 రోజుల స‌మ‌యం ఉన్నందున వాళ్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. ఒకవేళ విఫలమైతే మాత్రం వీరిపై వేటు వేసేందుకు బీసీసీఐ వెనుకడుగు వేయదన్నాడు.

'కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నిలకడలేమి ఫామ్‌తో సతమతమయ్యాడు. కానీ ఈ సీజన్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాది మంచి టచ్‌లోకి వచ్చాడు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఇద్దరూ భారత జట్టు తరఫున రాణించారు. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ ఐపీఎల్‌లో రాహుల్ చాహర్ మెరిసాడు. భువనేశ్వర్ కుమార్ అనుభవం కలిగిన బౌలర్. ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి వీరు ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్క హార్దిక్ పాండ్యా వ్యవహారమే బీసీసీఐకి తలనొప్పిగా మారింది. అయితే వీరు ఫామ్ అందుకోకపోతే మాత్రం వీరిపై వేటు పడటం ఖాయం. వీరి స్థానాల్లో ఇతర ఆటగాళ్లకు చోటు దక్కుతుంది'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

పాక్‌తో తొలి పోరు..

పాక్‌తో తొలి పోరు..

ఇక అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. అక్టోబర్ 23న అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.

స్టాండ్‌ బై ప్లేయర్స్‌: శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌.

Story first published: Tuesday, September 28, 2021, 18:17 [IST]
Other articles published on Sep 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+