టీ20 వరల్డ్‌కప్ వాయిదా.. 28న క్లారిటీ ఇవ్వనున్న ఐసీసీ!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమవ్వాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులతో ఈ మెగా టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేయడం కూడా టోర్నీ నిర్వహణకు ప్రతికూలంగా మారింది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 28న అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో సమావేశంకానుంది. ఈ భేటీలో మెగా టోర్నీ నిర్వహణ గురించి ఆతిథ్య దేశంపై ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు క్రికెట్ బోర్డుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనుంది. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలను క్రికెట్ ఆస్ట్రేలియా ముందు ఉంచే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

ఐసీసీ అడిగే ప్రశ్నలు
1. అక్టోబరులో 16 క్రికెట్ జట్లు ఆస్ట్రేలియాకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందా..?
2. సెప్టెంబరు వరకూ ఆస్ట్రేలియాలో లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. మరి టీ20 వరల్డ్‌కప్‌కు ఏర్పాట్లు ఎలా చేయగలుగుతారు?
3. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆస్ట్రేలియాలో క్వారంటైన్ రూల్స్ ఎలా ఉండబోతున్నాయి?
4. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే అగ్రస్థాయి క్రికెట్ జట్లు ప్రపంచకప్ ఆడేందుకు ఆసీస్‌కు వస్తాయని అనుకుంటున్నారా..?

ప్రేక్షకుల్లేకుండా నిర్వహిస్తే..
ఇక కరోనా వైరస్ కారణంగా టీ20 వరల్డ్‌కప్‌ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రాథమికంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కి సూచించింది. దాంతో ఆదాయం, ప్రేక్షకాదరణ పరంగా చాలా నష్టపోవాల్సి ఉంటుందని ఐసీసీతో పాటు సీఏ కూడా కంగారుపడుతోంది. కాబట్టి షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్‌కప్ జరగడం సందేహామేనని ఇటీవల ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ కోసం బీసీసీఐ ప్రయత్నాలు..
టీ20 వరల్డ్‌కప్ రద్దయితే.. ఆ అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తోంది. దీంతో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు బీసీసీఐకి వ్యతిరేకంగా ఇప్పటికే వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కానీ తెరవెనుక ఇప్పటికే శ్రీలంక, సౌతాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల క్రికెట్ బోర్డుల మద్దతుని కూడగట్టుకున్న బీసీసీఐ.. టీ20 వరల్డ్‌కప్ వాయిదా కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.

ఐపీఎలే కావాలంటున్న టాప్ క్రికెటర్లు..
ఇక టాప్ క్రికెటర్లు సైతం ఐపీఎల్‌తో క్రికెట్‌ను ప్రారంభించాలని కోరుతున్నారు. దాంతో ప్రపంచకప్‌కు ముందు మంచి సన్నహాకంగా కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే క్రికెట్ టోర్నీలు రద్దయి నయా పైసా రాబడి లేకుండా ఇంటికే పరిమితమైన స్టార్ ఆటగాళ్లు.. కోట్లు కురిపించే ఐపీఎల్‌ను చేజార్చుకోవద్దని భావిస్తున్నారు. దాంతోనే ఎలాంటి నిబంధనలైన సరే.. ఐపీఎల్ మాత్రం నిర్వహంచాలంటున్నారు. అయితే ఐపీఎల్ నిర్వహణపై భారత ప్రభుత్వానిదే తుది నిర్ణయమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేయడం బీసీసీఐ అధికారులకు గుబులు పెట్టిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications