For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిషేక్ శర్మకు చెప్పు చూపించిన యువరాజ్ సింగ్!

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు తన మెంటార్ యువరాజ్ సింగ్ చెప్పు చూపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు మ్యాచ్‌ల తర్వాత అతను ఫామ్ అందుకున్నాడు. జింబాబ్వేతో గురువారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. బ్యాట్‌తోనే తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌ను ఇన్‌స్టా పోస్ట్‌తో అభిషేక్ శర్మ సెలెబ్రేట్ చేసుకున్నాడు.'కృతజ్ఞతతో ఉన్నాను. లక్ష్యంపై దృష్టి పెట్టాను. ముందుకు సాగుతున్నాను'అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ పోస్ట్‌కు యువరాజ్ సింగ్ ఓ చెప్పు ఎమోజీని కామెంట్‌గా పెట్టాడు. దాంతో నెటిజన్లు షాక్ అయ్యారు.

అయితే యువీ ఇలా చెప్పు ఎమోజీ పెట్టడం ఇదే తొలిసారి. గతంలో అతను ఈ తరహా ఏమోజీలను పెట్టాడు. ఆటపై మరింత ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతోనే యువీ మందలించాడు. మరోవైపు అభిషేక్ శర్మ ప్రదర్శనను కొనియాడుతూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.

Yuvraj Singh Is Hilarious Slipper Emoji Comment on Abhishek Sharma s Post Goes Viral

టీమ్ మేనేజ్‌మెంట్ అందించిన సహకారంతోనే తాను ఫామ్ అందుకోగలిగానని అభిషేక్ శర్మ తెలిపాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ.. జట్టు సపోర్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నా కంటే సహచర క్రికెటర్లకే నాపై నమ్మకం ఎక్కువగా ఉంది. హాఫ్ సెంచరీ చేశాక భావోద్వేగానికి గురయ్యా. అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించా. అయినా నా బెస్ట్ ఇంకా రాలేదు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ చాలా అద్భుతంగా ఉంది. మేం ఒక జట్టులా కాకుండా కుటుంబంలా ఉంటాం. అందుకే నా నుంచి బెస్ట్ గేమ్ రావాలని జట్టు అంతా కోరుకుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా. నేను కూడా ఎదురు చూస్తున్నా.

టీ20 ప్రపంచకప్ ప్రారంభమయ్యే సమయానికి నా ఆరోగ్యం కూడా అంత బాలేదు. అంతకుముందు ఆసుపత్రిపాలయ్యా. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో దేశం కోసం తొలి మ్యాచ్ ఆడేటప్పుడు మంచి ఆరంభం దక్కాలని కోరుకున్నా. కానీ అలా జరగలేదు. అయినా సరే, జట్టు సభ్యుల నుంచి ఇప్పటికీ అదే మద్దతు లభిస్తోంది. మరీ ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యభాయ్ నాపై చాలా నమ్మకం ఉంచారు.

ఇంకో మ్యాచ్ డకౌట్ అయినా సరే పక్కన పెట్టేది లేదని.. జట్టు కోసం విజయాలు అందించాలని చెప్పారు. జట్టుకు కీలకమైన ప్లేయర్‌గా నన్ను భావించారు. అందుకే, జింబాబ్వేపై హాఫ్ సెంచరీని నేను నా జట్టు సహచరులు, కోచ్, కెప్టెన్‌కు అంకితం చేశాం.'అని అభిషేక్ వెల్లడించాడు.

Yuvraj Singh Is Hilarious Slipper Emoji Comment on Abhishek Sharma s Post Goes Viral
Story first published: Friday, February 27, 2026, 21:52 [IST]
Other articles published on Feb 27, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+