Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ X వెస్టిండీస్ మ్యాచ్ రద్దయితే.. సెమీస్ చేరేది ఎవరంటే..?

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. సూపర్-8 పోరులో భాగంగా జింబాబ్వేతో గురువారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు ముందే సౌతాఫ్రికాను వెస్టిండీస్ చిత్తు చేయడంతో ఈ గ్రూపులోని సమీకరణాలు తేలికయ్యాయి. ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్ బెర్త్ ఖరారు కాగా జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండో సెమీస్ బెర్త్ కోసం వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ నెలకొంది.

ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగే తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టులో టోర్నీలో ముందడుగు వేయనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఇరు జట్లకు ఇది క్వార్టర్ ఫైనల్‌లా మారింది. ప్రస్తుతానికి రన్‌రేట్‌తో పని లేదు. కానీ ఈ మ్యాచ్ వర్షం ఆటంకం కలిగిస్తే రన్‌రేట్ కీలకం కానుంది.

T20 World Cup 2026 What happens if India vs West Indies match gets washed out

భారత్ X వెస్టిండీస్ మ్యాచ్ రద్దయితే..

వర్షంతో భారత్, వెస్టిండీస్ మ్యాచ్ రద్దయితే మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతోంది. ఈ లెక్కన వెస్టిండీస్ సెమీస్ చేరనుండగా భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే వెస్టిండీస్ రన్‌రేట్ 1.791తో పాజిటీవ్‌లో ఉండగా.. భారత్ రన్‌రేట్ -0.100తో నెగటీవ్‌లో ఉంది. సౌతాఫ్రికా చేతిలో 77 పరుగుల భారీ తేడాతో భారత్ ఓడిపోవడంతో రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి రన్‌రేట్ మెరుగుపర్చుకునే అవకాశం ఉన్నా.. భారత్ పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రధాన బౌలర్లతో కాకుండా ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్స్ ఉపయోగించాడు.

కోల్‌కతా వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్‌కు వర్ష సూచన లేకున్నా.. ఏ ఇతర కారణాల వల్ల రద్దయితే మాత్రం భారత్ పోరాటం ముగియనుంది. ఎందుకంటే సూపర్-8 మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. ఈ క్రమంలోనే జింబాబ్వే‌తో మ్యాచ్‌లో భారత్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాల్సిందని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బౌలింగ్‌పై కూడా ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు.

Story first published: Friday, February 27, 2026, 14:55 [IST]
Other articles published on Feb 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+