భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ గుడ్ న్యూస్ చెప్పాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకున్నాడని తెలిపాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని చెప్పాడు. గురువారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆడేది లేనిది అతని ఆరోగ్య స్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశాడు.
ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అభిషేక్ శర్మ సోమవారం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు అతను దూరంగా ఉన్నాడు. నమీబియాతో మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని తెలిపాడు.

'ఢిల్లీకి వచ్చాక అభిషేక్ శర్మను పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాం. అతను ఈరోజే డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం బాగానే ఉన్నాడు. మ్యాచ్‌కు మరో రోజు సమయం ఉంది కాబట్టి, అతని పరిస్థితిని బట్టి టీమ్‌మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుంది.
బుమ్రా ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతని ఆరోగ్యం మెరుగ్గా ఉంది. మేనేజ్‌మెంట్ అతని విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. రేపటి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నా. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటానికి మేం సిద్ధంగా ఉన్నాం. పాక్‌తో మ్యాచ్ జరగబోతోందని మాకు ఒక రోజు ముందే తెలిసింది.
మేం ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. ఇతర జట్ల ఆటతీరును గమనిస్తున్నాం. బౌలర్లు, బ్యాటర్లను నిశితంగా
చూస్తున్నాం. ఆటగాళ్లందరూ టీమ్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మేం మ్యాచ్ మోడ్‌లోకి వచ్చేశాం. మా ప్రణాళికలను ప్రారంభిస్తాం.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
అమెరికాతో తొలి మ్యాచ్‌లో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా.. నమీబియాతో ఆల్‌రౌండ్‌షో కనబర్చాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్-8 అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకుంటుంది. తద్వారా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాలనే యోచనలో టీమిండియా ఉంది. నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగనున్నాడు. అమెరికాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న బుమ్రా ఫిట్ అవ్వడంతో సిరాజ్‌పై వేటు పడనుంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కనపెట్టనున్నారు.