For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2026: సూపర్-8లో టీమిండియాకు దబిడి దిబిడే!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో హ్యాట్రిక్ విజయాలతో టీమిండియా సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పాకిస్థాన్‌తో గత ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది.

అయితే సూపర్-8లో టీమిండియా తలపడబోయే జట్లపై స్పష్టత వచ్చింది. ఈ టోర్నీకి ముందు ఐసీసీ సూపర్-8 గ్రూప్స్ సీడింగ్ తీసింది. గ్రూప్ దశలో తలపడిన జట్లు మరోసారి సూపర్-8లో తలపడకుండా ఈ సీడింగ్ తీసారు.

భారత్‌కు టఫ్ ఛాలెంజ్..

భారత్‌తో పాటు ఇప్పటికే సూపర్-8 సాధించిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూప్‌లో ఉండనున్నాయి. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు అయితే సూపర్-8 చేరుతుందో ఆ జట్టుకే భారత్ గ్రూప్‌లో చోటు దక్కనుంది. ఒకవేళ ఆస్ట్రేలియా కూడా అర్హత సాధిస్తే ఈ గ్రూప్ మరింత టఫ్‌గా మారనుంది.

T20 World Cup 2026 Team India Face Group of Death in Super 8s High-Voltage Clashes vs South Africa and West Indies Scheduled

భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..

సూపర్-8లో భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 22న సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 26న జింబాబ్వే, ఆస్ట్రేలియాలో ఒక జట్టుతో తలపడుతుంది. మార్చి 1న వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకునే అవకాశం ఉంది. లీగ్ ఫార్మాట్ పూర్తయిన తర్వాత సూపర్-8 గ్రూప్స్‌పై మరింత స్పష్టత రానుంది.

ఫిబ్రవరి 22: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా(అహ్మదాబాద్, రాత్రి 7 గంటలకు)

ఫిబ్రవరి 26: భారత్ వర్సెస్ జింబాబ్వే/ఆస్ట్రేలియా(చెన్నై), రాత్రి 7 గంటలకు)

మార్చి 1: భారత్ వర్సెస్ వెస్టిండీస్(కోల్‌కతా, రాత్రి 7 గంటలకు)


టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?

ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ గ్రూప్‌లో ఉన్న ఐదు జట్లు లీగ్ దశలో తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. అంటే ఒక్కో జట్టు నాలుగేసి లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ 4 మ్యాచ్‌లు ముగిసే సరికి ప్రతీ గ్రూప్‌లో టాప్-2‌లో నిలిచిన జట్లు సూపర్-8‌కు అర్హత సాధిస్తాయి.

ఈ 8 జట్లను మళ్లీ రెండు గ్రూప్స్‌గా విభజిస్తారు. ఇక్కడ మళ్లీ ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. అంటే ప్రతీ టీమ్ మూడేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల అనంతరం టాప్-2లో నిలిచిన జట్లు రెండు గ్రూప్స్ నుంచి సెమీస్ చేరుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి.

Story first published: Tuesday, February 17, 2026, 10:22 [IST]
Other articles published on Feb 17, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+