అభిషేక్‌పై కాదు.. వారి గురించే మా టెన్షన్: సూర్యకుమార్ యాదవ్
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. కానీ అతని ఫామ్ గురించి ఆందోళనపడేవారి గురించే తనకు ఆందోళనగా ఉందని చమత్కరించాడు. అభిషేక్ శర్మ ఆటపై తమకు పూర్తినమ్మకం ఉందని, అతను కచ్చితంగా ఫామ్ అందుకుంటాడని తెలిపాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ డకౌటైన సంగతి తెలిసిందే. అమెరికాతో తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్.. అనారోగ్యంతో నమీబియాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చినా డకౌట్‌గానే వెనుదిరిగాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ సున్నాకే ఔటయ్యాడు. దాంతో అభిషేక్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకోవడంతో పాటు సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

వారిపైనే మా ఆందోళన..
ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు అభిషేక్ శర్మపై నోరు పారేసుకుంటున్నారు. దాంతో సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ బెంచ్ పరిమితమవుతాడనే అభిప్రాయం వ్యక్తమైంది. అతని స్థానంలో సంజూను ఆడిస్తారనే వాదన వినిపించింది. కానీ సూపర్-8 పోరుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో సూర్యకుమార్ యాదవ్.. ఈ వాదనను ఖండించాడు. అభిషేక్ శర్మనే బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.
'అభిషేక్ శర్మ ఫామ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. అతని ఫామ్ గురించి ఆందోళనపడేవారి గురించే మా ఆందోళన. ఇది టీమ్ గేమ్. ఒక్కోసారి ఎలాంటి ఆటగాడికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. గత ఏడాది మొత్తం అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడి మాకు విజయాలు అందించాడు. అభిషేక్ శర్మ ఒక్కసారి సెట్ అయితే ఎంత పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడతాడో అందరికీ తెలుసు. అతని ప్రయత్నం ఒక్కసారి సఫలమైతే చాలు ఆపడం చాలా కష్టం. విఫలమైతే మిగతా బ్యాటర్లందరూ పరుగులు చేస్తాం.
అభిషేక్ విఫలమైతే..
ఇక్కడ నా ఆందోళన అంతా ప్రత్యర్థుల గురించే. ఇప్పటి వరకు పరుగుల ఖాతా తెరవలేదు. అతను పరుగులు చేయడం మొదలుపెడితే వారికి కష్టాలు తప్పవు. అతన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆగమాగం అవుతారు. సంజూ శాంసన్ తుది జట్టులోకి రావాలని మీరు(మీడియా ప్రతినిధులు) కోరుకుంటున్నారా? అభిషేక్, తిలక్ వర్మ స్థానంలో ఆడాలని భావిస్తున్నారా? ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయాలని అనుకుంటున్నాం. అందుకు సన్నద్ధమవుతున్నాం. తుది జట్టు పైనా కసరత్తు చేస్తాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఫామ్ అందుకుంటాడు..
మరోవైపు అభిషేక్ శర్మ ఫామ్‌పై జట్టులో ఎలాంటి చర్చ జరగలేదని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. 'ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ ప్రదర్శన గురించి జట్టులో ఎలాంటి చర్చ జరగలేదు. ప్రపంచ స్థాయి బ్యాటర్, నంబర్ వన్ బ్యాటర్, అభిషేక్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇతర ఆటగాళ్లు ముందుకొచ్చి బాధ్యత తీసుకుంటున్నారు. తప్పకుండా ఫామ్ అందుకొని పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు.'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications