Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ వల్లే శుభ్‌మన్ గిల్‌పై వేటు: అశ్విన్

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కారణంగానే టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ హయాంలోనే టీమిండియా పవర్ ప్లేలో దూకుడుగా ఆడటం మొదలుపెట్టిందని, ఆ శైలికి తగ్గట్లు గిల్ ఆడలేకపోయాడని తెలిపాడు. భారత దూకుడైన శైలికి సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు సరిగ్గా సరిపోతారని చెప్పాడు.

శుభ్‌మన్ గిల్ కోసం ఓపెనర్‌గా అద్భుతంగా ఆడిన సంజూ శాంసన్ తప్పించి అవకాశం ఇచ్చారు. ఆసియా కప్‌లో గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగగా.. సంజూ మిడిలార్డర్‌లో ఆడారు. ఇద్దరూ పేలవ ప్రదర్శన కనబర్చారు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో గిల్ ఓపెనర్‌గా ఆడగా.. సంజూపై వేటు పడింది.

T20 World Cup 2026 Shubman Gill s Omission Linked to Rohit Sharma s Tactical Planning

ఆఖరి టీ20కి ముందు శుభ్‌మన్ గిల్ గాయపడగా.. ఆ మ్యాచ్‌లో సంజూ ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటాడు. దాంతో గిల్ అనవసరమని భావించిన టీమ్‌మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌నే ఓపెనర్‌గా కొనసాగిస్తూ.. అతనికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకుంది. ఈ ఏడాది గిల్ 15 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 137.26 స్ట్రైక్‌రేట్‌తో 291 పరుగులే చేశాడు.

తాజాగా టీ20 ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టు గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'శుభ్‌మన్ గిల్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి చాలా మద్దతు లభించింది. అతను నేరుగా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సెలెక్టర్లు కూడా అతనిపై చాలా నమ్మకం ఉంచారు. కానీ అతను నిరూపించుకోలేకపోయాడు. దాంతో మేనేజ్‌మెంట్ కూడా తమ నిర్ణయాన్ని మార్చుకుంది.

టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టు బలంగా ఉంది. ఎందుకంటే పవర్‌ప్లేలో భారత్ వినూత్న శైలిలో ఆడుతుంది. గత ప్రపంచకప్‌లోనే రోహిత్ దూకుడును పరిచయం చేశాడు. అదే శైలిని కొనసాగించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. దాంతోనే సంజూ శాంసన్, అభిషేక్ శర్మలకు అవకాశం దక్కింది. వారు అద్భుతంగా ఆడుతున్నారు.

వాస్తవానికి ఓపెనింగ్ స్లాట్‌‌కు శుభ్‌మన్ గిల్ సరికాదు. ఇది టీమ్‌కాంబినేషన్‌ను దెబ్బతీస్తోంది. శుభ్‌మన్ గిల్ తప్పించడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. అతను దూకుడుగా ఆడలేకపోయాడు. దురదృష్టవశాత్తు శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. సంజూకు అవకాశం దక్కింది. అతను నిరూపించుకున్నాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది ఓపెనర్‌గా గిల్ 147.77 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తే.. సంజూ శాంసన్ కూడా 147.31 స్ట్రైక్‌రేట్‌తో రాణించాడు. ఇద్దరి స్ట్రైక్‌రేట్ విషయంలో పెద్ద తేడా లేదు. కానీ గిల్ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. ఓపెనర్‌గా గిల్ 36 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ మాత్రమే సాధించగా.. శాంసన్ అందులో సగం మ్యాచ్‌ల్లోనే 3 శతకాలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

Story first published: Monday, December 22, 2025, 13:38 [IST]
Other articles published on Dec 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+