For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ చేతిలో ఘోర ఓటమి.. పాక్ కీలక నిర్ణయం!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌ చేతిలో ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు పీసీబీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే పీసీబీ దిద్దుబాటు చర్యలను చేపట్టినట్లు తెలుస్తోంది. జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ ఆగ్రహంతో ఉన్నట్లు పీసీబీ అధికారి ఒకరి మీడియాకు తెలిపారు. ఓటమి తర్వాత అర్ధరాత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

పాకిస్థాన్ ఓటమికి కారణమైన సీనియర్ ప్లేయర్స్ బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిదిపై వేటు వేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వారి స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీమ్, ఫకర్, ఖవాజా పేర్లను నమీబియాతో మ్యాచ్‌కు పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఆదివారం కొలంబో వేదికగా జరిగిన ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై భారత్ 176 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలింది. ఈ భారీ విజయంతో గ్రూప్-ఏ నుంచి టీమిండియా సూపర్-8 బెర్త్ దక్కించుకోగా.. పాకిస్థాన్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

T20 World Cup 2026 PCB Decides to Drop Babar Azam and Shaheen Afridi Following Humiliating India Loss

61 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలవ్వడంతో పాకిస్థాన్ నెట్‌రన్‌రేట్ కూడా దెబ్బతిన్నది. నమీబియాతో జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకంగా మారింది. బుధవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాకిస్థాన్‌కు సూపర్ 8 బెర్త్ దక్కనుంది. ఓడితే ఇంటి బాట పట్టనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌ను పీసీబీ సీరియస్‌గా తీసుకుంది. జట్టుకు భారంగా మారిన బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిదిలను బెంచ్‌కే పరిమితం చేయాలనుకుంటుంది.

భారత్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ 5 పరుగులే చేసి వెనుదిరగ్గా.. షాహిన్ షా అఫ్రిది రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 31 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఈ ఇద్దరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వరుసగా విఫలమవుతున్నా.. ఈ ఇద్దర్నీ జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది ప్రశ్నించారు.

షాహిన్ అఫ్రిది తన అల్లుడైనా సరే మెరుగైన ప్రదర్శన లేకుంటే జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు. అక్తర్ అయితే పీసీబీ ఛైర్మెన్ మోహ్‌సిన్ నఖ్వీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసమర్థుడిని అందలం ఎక్కిస్తే ఫలితం ఇలానే ఉంటుందని విమర్శించాడు. తానే సెలెక్టర్ అయితే బాబర్ ఆజామ్‌తో పాటు షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లను జట్టు నుంచి తప్పించేవాడినని తెలిపాడు.

Story first published: Monday, February 16, 2026, 21:29 [IST]
Other articles published on Feb 16, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+