For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2026: సూపర్-8 చేరిన పాకిస్థాన్.. ఎన్‌ఆర్‌ఐ టీమ్ ఔట్!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించింది. టోర్నీలో ముందుడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ సమష్టిగా చెలరేగింది. గ్రూప్-ఏలో భాగంగా

బుధవారం కొలంబో వేదికగా నమీబియాతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. షాహిబ్జాదా ఫర్హాన్ అజేయం శతకంతో సత్తా చాటగా ఉస్మాన్ తారిక్(4/16) నాలుగు వికెట్లతో నమీబియా పతానాన్ని శాసించాడు.

ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి భారత్‌తో పాటు పాకిస్థాన్‌ సూపర్-8కు అర్హత సాధించింది. మరోవైపు నమీబియా ఓటమితో ప్రపంచకప్ టోర్నీని ముగించింది. పాకిస్థాన్ విజయంతో భారత ఎన్‌ఆర్‌ఐ ఆటగాళ్లతో కూడిన అమెరికా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. నమీబియా, నెదర్లాండ్స్‌పై గెలిచిన అమెరికా.. పాకిస్థాన్, భారత్ చేతిలో ఓటమిపాలైంది.

T20 World Cup 2026 Pakistan Qualify for Super 8 After Dominant 102-Run Win Over Namibia

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 3 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. షాహిబ్జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ సల్మాన్ అఘా(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), షాదాబ్ ఖాన్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో జాక్ బ్రెస్సెల్(2/48) రెండు వికెట్లు తీయగా.. గెర్హార్డ్ ఎరాస్మస్(1/25) ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లారేన్ స్టీన్‌కాంప్(23), అలెగ్జండర్(20) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్(4/16) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షాదాబ్ ఖాన్(3/19) మూడు వికెట్లు తీసాడు. సల్మాన్ మిర్జా, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.

పాకిస్థాన్ సూపర్-8 షెడ్యూల్

ఫిబ్రవరి 21: పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ కొలంబో (శ్రీలంక) రాత్రి 7:00
ఫిబ్రవరి 24 పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ క్యాండీ (శ్రీలంక) రాత్రి 7:00
ఫిబ్రవరి 28 పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక క్యాండీ (శ్రీలంక) రాత్రి 7:00

Story first published: Wednesday, February 18, 2026, 18:29 [IST]
Other articles published on Feb 18, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+