Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs USA: అప్పటిలానే పాక్‌ను ఓడిస్తాం: అమెరికా కెప్టెన్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అమెరికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తెలిపాడు. గత టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌ను ఓడించామని, అదే ఫలితాన్ని పునరావృతం చేసే ప్రయత్నం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన ట్రాక్ లాగా కనిపిస్తోంది. ఇక్కడ నిలకడగా గాలి వీస్తోంది. కాబట్టి లక్ష్యం ఎంతో తెలిస్తే ఛేజింగ్ సులువు అవుతుంది. మా జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయంతో అలీ ఖాన్ దూరం కాగా.. ఆదిల్ వచ్చాడు. సాయి ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో జహంగీర్ బరిలోకి దిగుతున్నాడు.

గత మ్యాచ్‌లో మేం మంచి క్రికెట్ ఆడాం. ఆ మ్యాచ్ నుంచి చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. పెద్ద జట్లపై గెలవాలంటే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించడం ముఖ్యం అని మేం చర్చించుకున్నాం. కాబట్టి ఈ మ్యాచ్‌లో రెండు విభాగాల్లోనూ రాణించడంపైనే దృష్టి పెడతాం. గత టోర్నీలో మాకు ఒక గొప్ప మ్యాచ్ జరిగింది.

PAK vs USA Monank Patel Says USA Can Beat Pakistan Again Like Last T20 World Cup
Photo Credit: twitter (X)

పాకిస్థాన్‌తో ఆడటం అదే మొదటిసారి.ఆ మ్యాచ్‌లో మా ప్రదర్శన అద్భుతం. ప్రతీ ఒక్కరు రాణించారు. ఆ మ్యాచ్ నుంచి ఆత్మవిశ్వాసం, ప్రేరణ పొంది ఈ రోజు అదే ఫలితాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తాం.'అని మోనాంక్ పటేల్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు తమ జట్టులో ఒక మార్పు జరిగిందని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. 'మేం జట్టులో ఒక మార్పు చేశాం. ఉస్మాన్ తారిక్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. దురదృష్టవశాత్తూ సల్మాన్ మీర్జా ఆడటం లేదు. ఉస్మాన్‌కు ఒక అవకాశం ఇవ్వాలని మేం అనుకున్నాం. అతను మ్యాచ్ విన్నర్, మాకు ట్రంప్ కార్డ్ లాంటివాడు. అందుకే అతన్న బరిలోకి దించుతున్నాం.

గత మ్యాచ్ తర్వాత మేం మెరుగుపర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని గ్రహించాం. మేం కూర్చొని వాటి గురించి చర్చించుకున్నాం. ఈ రోజు మెరుగైన ప్రదర్శన చేస్తామని భావిస్తున్నా. గత కొన్ని నెలలుగా మేం నిజంగా మంచి క్రికెట్ ఆడుతున్నాం. ప్రతీ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నాం.'అని సల్మాన్ అలీ అఘా తెలిపాడు.

తుది జట్లు :

పాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్.

యూఏఈ: ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), షాయన్ జహంగీర్, మొనాంక్ పటేల్ (కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మహ్మద్ మోహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, ఎహసాన్ ఆదిల్, సౌరభ్ నేత్రవల్కర్.

Story first published: Tuesday, February 10, 2026, 19:02 [IST]
Other articles published on Feb 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+