For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2026: పాపం యువరాజ్ .. న్యూజిలాండ్ ఘన విజయం!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో న్యూజిలాండ్ సూపర్-8 చేరింది. గ్రూప్-డీలో భాగంగా కెనడాతో చెన్నై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్-డీ నుంచి రెండో జట్టుగా సూపర్-8కు అర్హత సాధించింది. అయితే కెనడా తరఫున శతకంతో రాణించిన యువరాజ్ సమ్రా కష్టం బుగ్గిపాలైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యువరాజ్ సమ్రా(65 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 110) సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌గా దిల్‌ప్రీత్ బజ్వా(39 బంతుల్లో 4 ఫోర్లతో 36) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకోబ్ డఫ్ఫీ, కైల్ జెమీసన్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీసారు.

T20 World Cup 2026 New Zealand Secure Super-8 Spot with Clinical Win Over Canada Yuvraj Samra s Historic Ton Goes in Vain

అనంతరం న్యూజిలాండ్ 15.1 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసి మరో 29 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. రచిన్ రవీంద్ర(39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), గ్లేన్ ఫిలిప్స్(36 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కెనడా బౌలర్లలో డిలన్, సాద్ బిన్ తలో వికెట్ తీసారు.

చరిత్ర సృష్టించిన యువరాజ్..

ఈ మ్యాచ్‌లో 58 బంతుల్లో సెంచరీ బాదిన యువరాజ్ సామ్రా..టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఈ ఫీట్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. కేవలం 19 ఏళ్ల 141 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు. ఇంతకు ముందు ఏ అసోసియేట్ దేశ ఆటగాడు కూడా టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ మార్కును అందుకోలేదు.

Story first published: Tuesday, February 17, 2026, 14:18 [IST]
Other articles published on Feb 17, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+