IND vs PAK: భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు..!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ జోరు కొనసాగుతోంది. వేదిక మారినా.. ప్రత్యర్థి ఏదైనా.. భారత్ ఆట మాత్రం మారడం లేదు. దాయాదీ పాకిస్థాన్‌పై సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మరోసారి పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ఆదివారం కొలంబో వేదికగా జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌ను సూర్య సేన తమ ఆధిపత్యంతో లోవోల్టేజ్‌గా మార్చేసింది. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్.. 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ నుంచి సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది.
ఇషాన్ కిషన్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా..
సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 32), శివమ్ దూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/25) మూడు వికెట్లు తీయగా.. ఉస్మాన్ తారిక్(1/24), సల్మాన్ అఘా, షాహిన్ షా అఫ్రిదిలకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 44) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/17), అక్షర్ పటేల్(2/29), వరుణ్ చక్రవర్తీ(2/17), హార్దిక్ పాండ్యా(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు.

మెయిడిన్ వికెట్..
176 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా మెయిడిన్ వికెట్ తీసాడు. ఓపెనర్ షాహిబ్‌జాదా ఫర్హాన్(0)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో సిక్స్ బాది జోరు కనబర్చిన సైమ్ అయూబ్(6) మరుసటి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో కెప్టెన్ సల్మాన్ అలీ అఘా(4)ను క్యాచ్ ఔట్ చేసిన బుమ్రా.. పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బతీసాడు. సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజామ్(5)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలోనే పాకిస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది.
ఈ పరిస్థితుల్లో ఉస్మాన్ ఖాన్ దూకుడుగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. షాదాబ్ ఖాన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని అక్షర్ పటేల్ స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మహమ్మద్ నవాజ్(4)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. షాదాబ్ ఖాన్(14)ను తిలక్ వర్మ పెవిలియన్ చేర్చాడు.
ఫహీమ్ అష్రఫ్, అబ్రర్ అహ్మద్‌ను వరుస ఓవర్లలో వరుణ్ పెవిలియన్ చేర్చి తృటిలో హ్యాట్రిక్ వికెట్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఉస్మాన్ తారిక్‌తో కలిసి షాహిన్ షా అఫ్రిది దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అతను వరుసగా ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ వదిలేసాడు. కానీ అదే ఓవర్‌లో ఉస్మాన్ తారిక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన హార్దిక్.. భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications