ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 176 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. ఇషాన్ కిషన్(40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 32), శివమ్ దూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27) పర్వాలేదనిపించారు.
ఓ దశలో 200 పరుగులు చేసేలా కనిపించిన భారత్‌ను పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్(1/24), సైమ్ అయుబ్(3/25) కట్టడి చేశారు. సల్మాన్ అఘా, షాహిన్ షా అఫ్రిదిలకు చెరో వికెట్ దక్కింది. స్లోగా ఉన్న ఈ పిచ్‌పై ఇది మంచి స్కోరే.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(0) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా వేసిన తొలి ఓవర్‌లోనే గుడ్డిగా షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. అలీ అఘా బిగించిన ఉచ్చులో పడి మూల్యం చెల్లించుకున్నాడు. అభిషేక్ ఔటైనా.. తిలక్ వర్మతో కలిసి మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ చెలరేగాడు. షాహీన్ షా అఫ్రిదికి భారీ సిక్సర్‌తో స్వాగతం పలికిన ఇషాన్.. అదే ఓవర్‌లో మరో రెండు బౌండరీలు కొట్టాడు. బ్యాటింగ్‌కు ప్రతీకూలంగా ఉన్న వికెట్‌పై ఇషాన్ తన దూకుడుతో బౌలర్లను పరేషాన్ చేశాడు. భారీ షాట్లతో పాక్ స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది.
అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలు బాది 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. అనంతరం అదే జోరు కనబర్చిన ఇషాన్ కిషన్‌ను సైమ్ ఆయూబ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇందులో ఇషాన్ కిషన్‌వే 77 పరుగులు అంటే.. అతని బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇషాన్ ఔటైన తర్వాత పరుగుల వేగం తగ్గింది. సూర్య, తిలక్ వర్మ ఆచితూచి ఆడారు. భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన తిలక్ వర్మ సైమ్ ఆయుబ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా తొలి బంతినే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే దూకుడుగా ఆడగా.. ఆచితూచి ఆడిన సూర్యకుమార్ యాదవ్(32)ను ఉస్మాన్ తారిక్ పెవిలియన్ చేర్చాడు. నాలుగు ఓవర్లలో 24 పరుగులే ఇచ్చిన ఉస్మాన్ తారిక్.. టీమిండియా భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసాడు.
షాహీన్ అఫ్రిది ఆఖరి ఓవర్‌లో శివమ్ దూబే ఒక ఫోర్ కొట్టగా.. రింకూ సింగ్, సిక్స్, ఫోర్ బాది 16 పరుగులు పిండుకున్నాడు. అయితే ఆఖరి రెండు బంతుల్లో శివమ్ దూబే రనౌట్ కాగా.. అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.