T20 World Cup 2026: రసవత్తరంగా సూపర్ 8 రేసు.. 5 జట్లు ఎంట్రీ! మరో 3 బెర్తుల కోసం 7 టీమ్స్ పోటీ!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ లీగ్ మ్యాచ్‌లు తుది దశకు చేరడంతో సూపర్-8 రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఐదు జట్లు సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. మరో 3 బెర్త్‌ల కోసం 7 జట్లు పోటీపడుతున్నాయి.
టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?
ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ గ్రూప్‌లో ఉన్న ఐదు జట్లు లీగ్ దశలో తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. అంటే ఒక్కో జట్టు నాలుగేసి లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ 4 మ్యాచ్‌లు ముగిసే సరికి ప్రతీ గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి.
ఈ 8 జట్లను మళ్లీ రెండు గ్రూప్స్‌గా విభజిస్తారు. ఇక్కడ మళ్లీ ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. అంటే ప్రతీ టీమ్ మూడేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల అనంతరం టాప్-2లో నిలిచిన జట్లు రెండు గ్రూప్స్ నుంచి సెమీస్ చేరుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి.

సూపర్-8 చేరిన 4 జట్లు..
- గ్రూప్-ఏలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్ సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకోగా.. మరో బెర్త్ కోసం అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. నమీబియాపై పాకిస్థాన్ విజయం సాధిస్తే సూపర్-8 చేరుతుంది. ఓడితే మాత్రం ఇంటి బాట పడుతుంది. ఈ మ్యాచ్ రద్దయినా పాక్ ముందడుగు వేస్తోంది.
- గ్రూప్-బీ నుంచి శ్రీలంక సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకుంది. వరుసగా మూడు విజయాలతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే పోటీపడుతున్నాయి. ఐర్లాండ్‌పై జింబాబ్వే విజయం సాధిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఇప్పటికే ఐర్లాండ్, ఒమన్ రేసు నుంచి తప్పుకున్నాయి.
- గ్రూప్-సీలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన వెస్టిండీస్, నాలుగింటిలో మూడు గెలిచిన ఇంగ్లండ్ సూపర్-8 బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి.
- గ్రూప్-డీలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికా సూపర్-8 చేరగా.. రెండో బెర్త్ కోసం న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, యూఏఈ పోటీపడుతున్నాయి. న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో కెనడాను ఓడిస్తే సూపర్-8 చేరుతుంది. ఓడితే మాత్రం రన్ రేట్ కీలకం అవుతుంది. అఫ్గానిస్థాన్ కెనడాతో, యూఏఈ.. సౌతాఫ్రికాతో తమ ఆఖరి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications