యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. దశాబ్దాల వైరం.. కోట్లాది మంది భావోద్వేగానికి ప్రతిరూపమైన భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ సమరానికి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తుంటే.. సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు చరిత్రను తిరగ రాయాలనే పట్టుదలతో ఉంది.
స్పిన్‌కు అనుకూలించే కొలంబో పిచ్‌పై విజయం ఎవరిని వరిస్తుందో? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. తమ జట్టుకు తగ్గ కండిషన్స్‌లో ఒకే వేదికగా పాకిస్థాన్ ఆడుతుండటం.. అందుకు తగ్గట్లుగా ఐదుగురు స్పిన్నర్లతో పాటు మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీక్ ఉండటం ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచించడంలో నిమగ్నమయ్యాయి.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న టీమిండియా.. పాకిస్థాన్ మ్యాచ్‌కు తుది జట్టులో వ్యూహాత్మక మార్పులు చేయనుంది. కొలంబో పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టీమిండియా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానుండగా.. అర్ష్‌దీప్ సింగ్ ఉద్వాసనకు గురవ్వనున్నాడు.

ఒకవేళ బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన స్పిన్నర్‌ను తీసుకోవాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వస్తాడు. కానీ స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ డెప్త్‌ను కొనసాగిస్తూనే.. స్పిన్ అటాక్‌ను పెంచే యోచనలో టీమిండియా ఉంది. దాంతోనే అర్ష్‌దీప్ సింగ్ బెంచ్‌కు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీతో పాటు కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా పాక్‌తో మ్యాచ్‌లో ఆడనున్నారు. పార్ట్‌టైమ్ స్పిన్నర్లుగా రాణించేందుకు రింకూ సింగ్, తిలక్ వర్మ సిద్దంగా ఉన్నారు.
అనారోగ్యంతో నమీబియాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. పాక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగడం సందేహంగా మారింది. పాక్‌తో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలపగా.. ఫిట్‌గా ఉన్నాడని, ప్రాక్టీస్ కూడా చేశాడని వరుణ్ చక్రవర్తీ చెప్పాడు. అంతేకాకుండా అభిషేక్ శర్మ సైతం తాను పూర్తిగా కోలుకున్నానని, అనారోగ్యంతో రెండు కిలోల బరువు తగ్గానని చెప్పిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ క్రమంలోనే అభిషేక్ ఆడటంపై సందేహం నెలకొంది. అభిషేక్ ఆడితే సంజూ మళ్లీ బెంచ్‌కే పరిమితమవుతాడు. లేదంటే బరిలోకి దిగుతాడు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, సూర్య, శివమ్ దూబే మరోసారి చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. ఏకైక స్పెషలిస్ట్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనుండగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే అతనికి అండగా పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ఇషాన్ కిషన్, సంజూ శాంసన్/అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్.