For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడే భారత్ జాతకం తేల్చే మ్యాచ్!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ కీలక దశకు చేరింది. సూపర్ 8 మ్యాచ్‌లు ముగింపు దశకు వచ్చాయి. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్(దాదాపు) సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. ఆసియా టీమ్స్ అయిన పాకిస్థాన్, శ్రీలంక నిష్క్రమించాయి. గ్రూప్ 1లో సెమీస్ చేరే జట్లపై నేటి మ్యాచ్‌లతో క్లారిటీ రానుంది. ముఖ్యంగా భారత్ సెమీస్ భవితవ్యం ఈ రోజు(గురువారం) 7 గంటల్లోపు తేలనుంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు 2 సూపర్ 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు వెస్టిండీస్‌తో సౌతాఫ్రికా తలపడనుండగా.. రాత్రి 7 గంటలకు భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది.

సౌతాఫ్రికా గెలిస్తే..

అయితే వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ ఫలితం భారత్ సెమీస్ అవకాశాలను నిర్దేశించనుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఓటమిపాలైతే రన్‌రేట్ లెక్కలతో సంబంధం లేకుండా చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధిస్తే టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఎందుకంటే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత భారత్ సెమీఫైనల్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే సౌతాఫ్రికా భారత్‌ను ఓడించి గ్రూప్-2‌లో రెండో స్థానంలో ఉండగా.. వెస్టిండీస్‌ను ఓడిస్తే 4 పాయింట్లతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంటుంది. అలా కాకుండా వెస్టిండీస్ విజయం సాధిస్తే మాత్రం.. ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించినా పేలవ రన్ రేట్ కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే వెస్టిండీస్ రన్ రేట్ ఇప్పటికే 5.350 ఉండగా.. సౌతాఫ్రికా 3.800తో ఉంది. భారత్ మాత్రం -3.800తో మూడో స్థానంలో కొనసాగుతోంది.

T20 World Cup 2026 India Semifinal fate Pivot on South Africa vs West Indies Clash in Ahmedabad

అభిమానుల పూజలు..

ఈ క్రమంలోనే వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా విజయం సాధించాలని యావత్ భారత్ కోరుకుంటుంది. అదే జరిగితే జింబాబ్వేతో పాటు వెస్టిండీస్‌తో మార్చి 1న జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి రన్ రేట్ లెక్కలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది.

ఎందుకంటే వెస్టిండీస్ మూడు మ్యాచ్‌లకు ఒకే ఒక్క విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరగాలని భారత అభిమానులు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. మరికొందరు మాత్రం భారత్‌కు సెమీస్ చేరే అర్హత లేదని, పక్క టీమ్‌పై ఆధారపడి సెమీస్ చేరితే టైటిల్ ఎలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భారత్ జాతకం తేల్చే మ్యాచ్ మొదలవ్వనుంది. డోంట్ మిస్ ఇట్.

Story first published: Thursday, February 26, 2026, 8:13 [IST]
Other articles published on Feb 26, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+