For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: భారత ఓటమికి కారణాలు ఇవే!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. వరుస విజయాలతో జోరు కబర్చిన భారత జట్టుకు సౌతాఫ్రికా కోలుకోలేని షాకిచ్చింది. సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.

ఈ భారీ ఓటమి.. టీమిండియా నెట్‌రన్‌రేట్‌ను దారుణంగా దెబ్బతీసింది. దాంతో సూర్యసేన తదుపరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచినా ఇతర జట్ల నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్ణుడి చావుకు 100 కారణాలున్నట్లుగా.. సూపర్-8 పోరులో భారత ఓటమికి అనేక కారణాలున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో నాలుగు తప్పిదాలు టీమిండియా పతనాన్ని శాసించాయి. వాటిపై ఓ లుక్కెద్దాం.

T20 World Cup 2026 4 Reasons for India s 76-Run Loss to South Africa in Super 8 Clash


1. బ్యాటింగ్ వైఫల్యం..

188 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శుభారంభం దక్కడం కీలకం. కానీ భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఇషాన్ కిషన్ (0), అభిషేక్ శర్మ (15), తిలక్ వర్మ (1) చెత్త షాట్లతో పవర్‌ప్లేలోనే వెనుదిరిగడంతో భారత్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. తర్వాతి బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. 'పవర్‌ప్లేలోనే మ్యాచ్ గెలవలేకపోవచ్చు కానీ.. ఆ 6 ఓవర్లు జట్టు ఫలితాన్ని శాసిస్తాయి'అని చెప్పాడు.

2. భాగస్వామ్యాల్లేవ్..

భారీ స్కోరును ఛేజ్ చేయాలంటే కనీసం రెండు, మూడు మంచి భాగస్వామ్యాలు అవసరం. కానీ సౌతాఫ్రికా బౌలర్లు మార్కో జాన్సెన్ (4/22), కేశవ్ మహారాజ్ (3/24) వరుసగా వికెట్లు తీసి భారత బ్యాటర్లను క్రీజులో సెట్ అవ్వనివ్వలేదు. శివమ్ దూబే (42) ఒక్కడే కాసేపు పోరాడినా.. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు.

3. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ వైఫల్యం..

బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ సౌతాఫ్రికాను 20/3 పరుగులకే కట్టడి చేసినా.. ఆ తర్వాత 7 నుండి 15 ఓవర్ల మధ్య భారత బౌలర్లు లయ తప్పారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా ఓవర్లలో డేవిడ్ మిల్లర్ (63), డేవాల్డ్ బ్రెవిస్ (45) విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి కేవలం 51 బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

4. హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ :

బుమ్రా డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీసినప్పటికీ, హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌తో సౌతాఫ్రికా స్కోరు 187కు చేరుకుంది. ఈ ఒక్క ఓవర్ మూమెంటమ్‌ను పూర్తిగా సౌతాఫ్రికావైపు మళ్లించింది. మానసిక పరంగా ఈ భారీ స్కోరు భారత బ్యాటర్లపై అదనపు ఒత్తిడిని పెంచింది. పిచ్ రీడ్ చేయడంలోనూ భారత సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లు విఫలమయ్యారు.

Story first published: Monday, February 23, 2026, 1:43 [IST]
Other articles published on Feb 23, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+