For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2026: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాకిస్థాన్ శుభారంభం చేసింది. గ్రూప్-ఏలో భాగంగా శనివారం నెదర్లాండ్స్‌తో ఉత్కంఠగా సాగిన ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫహీమ్ అష్రఫ్(11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29 నాటౌట్) దూకుడైన బ్యాటింగ్‌తో పాకిస్థాన్ ఓటమి నుంచి గట్టెక్కింది. నెదర్లాండ్స్ విజయవకాశాలను ఆ జట్టు బౌలర్ వాన్ బీక్ దెబ్బతీసాడు. 19వ ఓవర్‌లో అతను 24 పరుగులివ్వడంతో మ్యాచ్‌ పాకిస్థాన్‌వైపు టర్న్ అయ్యింది. ఇదే ఓవర్‌లో ఫహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాఫ్‌లో వదిలేయడం కూడా పాకిస్థాన్‌కు కలిసొచ్చింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37), బాస్ డీ లీడే(25 బంతుల్లో 4 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మిర్జా(3/24) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్, అబ్రర్ అహ్మద్, సయీమ్ ఆయుబ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షాహీన్ షా అఫ్రిది ఒక వికెట్ తీసాడు.

T20 World Cup 2026 Faheem Ashraf s Unbeaten 29 Helps Pakistan Avoid Heavy Loss vs Netherlands

అనంతరం పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ షాహిబ్‌జాదా ఫర్హాన్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), షహీమ్ అష్రఫ్(11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ సల్మాన్ అఘా(12), బాబర్ ఆజామ్(15), ఉస్మాన్ ఖాన్(0), షాదాబ్ ఖాన్(8), మహమ్మద్ నవాజ్(6) తీవ్రంగా నిరాశపర్చారు. ఓ దశలో 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ఓటమి దిశగా సాగింది. కానీ ఫహీమ్ అష్రఫ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌ను గట్టెక్కించాడు. ముఖ్యంగా వాన్ బీక్ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు, ఫోర్‌తో 24 పరుగులు పిండుకున్నాడు.

అయితే ఈ ఓవర్ రెండో బంతికి అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను లాంగాఫ్‌లో నెదర్లాండ్ ఫీల్డర్ వదిలేసాడు. ఈ అవకాశంతో చెలరేగిన ఫహీమ్ మరో రెండు సిక్స్‌లు, బౌండరీ బాది పాక్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఫహీమ్ క్యాచ్ పట్టి ఉంటే ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ సంచలన విజయాన్ని అందుకునేది.

Story first published: Saturday, February 7, 2026, 14:46 [IST]
Other articles published on Feb 7, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+