Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2026: సూరీడు.. మ్యాచ్‌కు యాలైందయ్యా!

T20 World Cup 2026: టీ20 క్రికెట్‌లో మరో ప్రపంచకప్ పోరుకు సమయం ఆసన్నమైంది. పొట్టి కప్‌లో సత్తా చాటేందుకు 20 జట్లు సిద్దమయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో జరగబోయే హోరాహోరీ సమరాలు ఆసక్తి రేపుతున్నాయి. బంగ్లాదేశ్ నిష్క్రమణ.. భారత్‌తో మ్యాచ్ పాక్ బహిష్కరణ నేపథ్యంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హిస్టరీ రిపీట్.. హిస్టరీ డిఫీట్ అనే నినాదంతో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా బరిలోకి దిగుతోంది.

ఆదివారం శ్రీలంకలోని కొలంబో వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. రోజుకు మూడు మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. ఆదివారం రాత్రి 7 గంటలకు స్కాట్లాండ్‌తో ప్రారంభమయ్యే మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.

హిస్టరీ రిపీట్.. హిస్టరీ డిఫీట్..

ఫామ్, ట్రాక్ రికార్డ్ చూసుకున్నా టీడిండియా హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. గత రెండేళ్లుగా టీమిండియా ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. టీ20 ప్రపంచకప్ 2026 చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ఆతిథ్య జట్టు టైటిల్ గెలవలేదు. అంతేకాకుండా ఏ టీమ్ కూడా వరుసగా రెండో టైటిల్ అందుకోలేదు. ఈ చరిత్రను తిరగరాయలనే పట్టుదలతో భారత్ ఉంది.

గత ప్రపంచకప్ విజయాన్ని పునరావుతం చేస్తూ.. గత చరిత్రను తిరగరాయలనే లక్ష్యంతో టీమిండియా ఉంది. ఈ క్రమంలోనే హిస్టరీ రిపీట్.. హిస్టరీ డిఫీట్ అనే నినాదంతో బరిలోకి దిగుతోంది. ఏ లెక్కన చూసుకున్నా భారత్ ముందు పసికూన అమెరికా ఏ మాత్రం పోటీ కాదు. కానీ ఎంత మేర పోటీనిస్తుంది? అనేది చూడాలి.

T20 World Cup 2026 Begins Sunday India vs USA Match Preview Format and Broadcast Details

20 జట్లు 4 గ్రూప్స్..

ఈ టోర్నీలో బరిలోకి దిగే 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశలో ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది. లీగ్ దశ ముగిసే సరికి ప్రతీ గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8 టీమ్స్‌ను నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూప్‌లుగా విభిజిస్తారు. లీగ్ దశలో ఒకే గ్రూప్‌లో ఆడి సూపర్-8కు అర్హత సాధించిన జట్లు వేర్వేరు గ్రూప్స్‌లో తలపడుతాయి. సూపర్-8లో కూడా ప్రతీ జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది. రెండు గ్రూప్స్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో గెలిచిన టీమ్స్ ఫైనల్ చేరుతాయి.

ఎలా చూడాలంటే..?

ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి స్టార్ స్పోర్ట్స్ , జియో హాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించనున్నాయి. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన అన్ని భాషల చానెల్స్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. రోజుకు మూడు మ్యాచ్‌లు ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7 గంటలకు మొదలవ్వనున్నాయి. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు చూడాలంటే.. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ప్రత్యేకమైన రిఛార్జ్ ప్లాన్స్‌తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.

భారత్ టీ20 ప్రపంచకప్ జట్టు:

సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శామ్సన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

అమెరికా టీ20 ప్రపంచకప్ జట్టు:

మొనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్ (బౌలర్), ఆండ్రీస్ గౌస్ (బ్యాటర్), అలీ ఖాన్ (బౌలర్), జెస్సీ సింగ్, షెహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షాయన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, మహమ్మద్ మొహ్సిన్, శుభం రంజనే.

Story first published: Friday, February 6, 2026, 12:27 [IST]
Other articles published on Feb 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+