Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2026: నేడు తేలనున్న ఆసీస్, న్యూజిలాండ్ భవితవ్యం!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో నేడు(మంగళవారం) కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. వరల్డ్ బిగ్గెస్ట్ టీమ్స్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా భవితవ్యం నేడే తేలనుంది. గ్రూప్-డీలో భాగంగా చెన్నై వేదికగా ఉదయం 11 గంటలకు కెనడాతో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే న్యూజిలాండ్ సూపర్-8 బెర్త్ ఖరారు కానుంది.

ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అఫ్గానిస్థాన్, యూఏఈ తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే రన్‌రేట్ కీలకం అవుతుంది. మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు టోర్నీలో ముందడుగు వేస్తోంది. ప్రస్తుతానికైతే న్యూజిలాండ్‌కే మెరుగైన రన్‌రేట్ ఉంది. గ్రూప్-డీ నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సూపర్-8 చేరింది.

T20 World Cup 2026 Australia Fate Rests on Zimbabwe vs Ireland New Zealand Aim for Super 8 Spot Against Canada

జింబాబ్వే చేతిలో ఆసీస్ భవితవ్యం..

గ్రూప్-బీలో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఓడితే ఆసీస్ సూపర్-8 ఆశలు సీజీవంగా ఉంటాయి. కానీ ఆ జట్టు ఓమన్‌తో జరిగే మ్యాచ్‌లో మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జింబాబ్వే తన ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోవాలి.

నేపాల్ X స్కాట్లాండ్..

గ్రూప్-సీలో భాగంగా రాత్రి 7 గంటలకు వాంఖడే వేదికగా నేపాల్, స్కాంట్లాడ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ సూపర్-8 చేరాయి.

ఇప్పటికే సూపర్-8 చేరి జట్లు

గ్రూప్-ఏ: భారత్

గ్రూప్-బీ: శ్రీలంక

గ్రూప్-సీ: వెస్టిండీస్, శ్రీలంక

గ్రూప్-డీ: సౌతాఫ్రికా

మూడు స్థానాల కోసం 7 జట్లు పోటీ..

గ్రూప్-ఏ‌లో రెండో బెర్త్ కోసం అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. నమీబియాపై పాకిస్థాన్ విజయం సాధిస్తే సూపర్-8 చేరుతుంది. ఓడితే మాత్రం ఇంటి బాట పడుతుంది. ఈ మ్యాచ్ రద్దయినా పాక్ ముందడుగు వేస్తోంది.

గ్రూప్-బీలో మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే పోటీపడుతున్నాయి. ఐర్లాండ్‌పై జింబాబ్వే విజయం సాధిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఇప్పటికే ఐర్లాండ్, ఒమన్ రేసు నుంచి తప్పుకున్నాయి.

గ్రూప్-డీ రెండో బెర్త్ కోసం న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, యూఏఈ పోటీపడుతున్నాయి. న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో కెనడాను ఓడిస్తే సూపర్-8 చేరుతుంది. ఓడితే మాత్రం రన్ రేట్ కీలకం అవుతుంది. అఫ్గానిస్థాన్ కెనడాతో, యూఏఈ.. సౌతాఫ్రికాతో తమ ఆఖరి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

Story first published: Tuesday, February 17, 2026, 9:29 [IST]
Other articles published on Feb 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+