Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AFG: కొంపముంచిన అఫ్గానిస్థాన్ అత్యుత్సాహం!

టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే కనివీని ఎరుగని రీతిలో సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకే ఈ మ్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు సమ ఉజ్జీలుగా తలపడటంతో ఒకటి కాదు.. రెండు సూపర్ ఓవర్లతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చాసి వచ్చింది.

అనుభవంతో సౌతాఫ్రికా డబుల్ సూపర్ ఓవర్‌లో గట్టెక్కగా.. అత్యుత్సాహంతో అఫ్గానిస్థాన్ ఓటమిపాలైంది. ఫలితం ఏదైనా.. విజయం ఎవరిని వరించినా.. ఈ మ్యాచ్‌ మాత్రం చరిత్రలోనే నిలిచిపోనుంది. అభిమానుల మదిలో చిరస్మరణీయం కానుంది.

అఫ్గానిస్థాన్ అత్యుత్సాహం

గ్రూప్-డీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం ఈ డబుల్ హైఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), ర్యాన్ రికెల్టన్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(3/41) మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. ఫజలక్ ఫరూఖీ ఒక వికెట్ తీసాడు.

T20 World Cup 2026 Afghanistan Overconfidence Proves Costly in Historic Double Super Over against South Africa

అనంతరం అఫ్గానిస్థాన్ 19.4 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులకే ఆలౌటైంది. రెహ్మానుల్లా గుర్బాజ్(42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో అఫ్గానిస్థాన్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. రబడా వరుసగా నోబాల్, వైడ్ వేయగా.. రెండో బంతిని నూర్ అహ్మద్ సిక్సర్ తరలించాడు. నాలుగో బంతిని మరో నోబాల్ వేయగా మొత్తం మూడు పరుగులు వచ్చాయి. దాంతో చివరి రెండు బంతుల్లో 2 పరుగులు అవసరం కాగా.. నాలుగో బంతికి సింగిల్ తీసిన అనంతరం డబుల్ తీసే ప్రయత్నంలో ఫజలక్ ఫరూఖి రనౌటయ్యాడు. ఫజలక్ ఫరూఖీ డైవ్ చేసినా.. ఈ బంతికి సింగిల్ తీసి.. ఆఖరి బంతికి మరో సింగిల్ తీసినా అఫ్గాన్ విజయం లాంఛనమయ్యేది.

ఒక్క మంచి బంతి వేసినా..

విజయం సాధించాలనే అత్యుత్సాహంతో అఫ్గాన్ అనవసర పరుగు తీసి మూల్యం చెల్లించుకుంది. అనంతరం
లుంగి ఎంగిడి వేసిన తొలి సూపర్ ఓవర్‌లో అఫ్గాన్ 17 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా కూడా సరిగ్గా 17 పరుగులే చేసింది. ఫజలక్ ఫరూఖి వేసిన ఈ ఓవర్‌లో బ్రేవిస్ సిక్స్ బాది ఔటవ్వగా.. స్టబ్స్ ఫోర్‌తో పాటు ఆఖరి బంతికి సిక్స్ బాది స్కోర్లు సమం చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ వేయకుండా ఫజలక్ ఫరూఖి అడ్డుకున్నా అఫ్గాన్ విజయం లాంఛనమయ్యేది.

రెండో సూపర్ ఓవర్‌లో అజ్మతుల్లా బౌలింగ్‌లో స్టబ్స్ ఒక సిక్స్, మిల్లర్ రెండు సిక్స్‌లతో సౌతాఫ్రికా 23 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ మాత్రం 19 పరుగులే చేసి ఓటమిపాలైంది. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వేసిన ఈ ఓవర్‌లో గుర్బాజ్ వరుసగా మూడు సిక్స్‌లు బాదినా ఫలితం లేకపోయింది. ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో గుర్బాజ్ క్యాచ్ ఔటయ్యాడు. ఈ మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒక మంచి డైవ్ లేదా ఒక మంచి బంతి ఫలితాన్ని మార్చేదని తెలిపాడు.

Story first published: Wednesday, February 11, 2026, 22:04 [IST]
Other articles published on Feb 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+