ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. గ్రూప్-బీలో భాగంగా కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాథన్ ఎల్లిస్(4/12) సంచలన బౌలింగ్‌తో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినీస్(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 45), మ్యాట్ రేన్‌షా(33 బంతుల్లో 2 ఫోర్లతో 37), జోష్ ఇంగ్లీస్(17 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్(2/44) రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ హంప్రేస్, జార్జ్ డాక్‌రెల్, హ్యారీ టెక్టర్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఐర్లాండ్ 16.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. జార్జ్ డాక్‌రెల్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) ఒక్కడే ఒంటరిపోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా(4/23), నాథన్ ఎల్లిస్(4/12) నాలుగేసి వికెట్లు తీయగా.. మాథ్యూ కుహ్నెమన్ ఒక వికెట్ పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్(6) రెండో ఓవర్‌లోనే రనౌటయ్యాడు. దాంతో క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్(21), జోష్ ఇంగ్లీస్(37) దూకుడుగా ఆడారు. కానీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కామెరూన్ గ్రీన్ క్యాచ్ ఔౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లేలో ఆసీస్ 2 వికెట్లకు 64 పరుగులు చేసింది.
జోష్ ఇంగ్లీస్, మ్యాట్ రేన్‌షా కూడా వెనుదిరిగ్గా.. మార్కస్ స్టోయినీస్ దూకుడుగా ఆడాడు. హాఫ్ సెంచరీ ముంగిట అతను ఔట్ కావడంతో ఆసీస్ 182 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఐర్లాండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. జార్జ్ డాక్‌రెల్(41) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతను కూడా ఔటవ్వడంతో ఐర్లాండ్‌కు ఘోర పరాజయం తప్పలేదు. గ్రూప్-బీలో రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిన ఐర్లాండ్.. సూపర్ 8 అవకాశాలను చేజార్చుకుంది.