టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మరికాసపేట్లో బంగ్లాదేశ్‌తో సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. ఓడితే మాత్రం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోనుంది.
సూపర్-8లో భారత్ గ్రూప్-1 విభాగంలో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ కూడా ఇదే విభాగంలో ఉన్నాయి. సూపర్-8లో ఒక్కో జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి.

ప్రతి విజయానికి 2 పాయింట్లు దక్కుతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు ఈ నాలుగు జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. ఆస్ట్రేలియా, భారత్‌లు ఒక్కో మ్యాచ్ గెలిచి తొలి రెండు స్థానాల్లో నిలవగా.. ఓటమిపాలైన అఫ్గాన్, బంగ్లాదేశ్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమిపాలైతే.. టీమిండియా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. సెమీస్ చేరాలంటే సోమవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా తప్పకుండా గెలవాలి. ఓడితే ఇంటిదారి పడుతోంది. గెలిచినా రన్ రేట్ కీలకం అవుతోంది.
బంగ్లాదేశ్‌పై ఓడి ఆసీస్‌పై గెలిస్తే.. భారత్ ఖాతాలో 4 పాయింట్స్ చేరుతాయి. మరోవైపు ఆస్ట్రేలియా.. అఫ్గాన్‌పై విజయం సాధిస్తే ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్స్ ఉంటాయి. బంగ్లాదేశ్ కూడా అఫ్గాన్‌పై గెలిస్తే నాలుగు పాయింట్స్ వస్తాయి. అప్పుడు మూడు జట్లలో రన్‌రేట్ మెరుగ్గా ఉన్న రెండు జట్లు సెమీస్ అర్హత సాధిస్తాయి.
ప్రస్తుతం నాలుగు జట్లలో ఆస్ట్రేలియా 2.471 మెరుగైన రన్ రేట్ కలిగి ఉంది. ఆ తర్వాత భారత్ 2.35తో రెండో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ రన్‌రేట్ -2.471 నెగటీవ్‌గా ఉంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌పై విజయం సాధించడం భారత్‌కు అత్యవసరం. ఒకవేళ బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటుంది.
బంగ్లాదేశ్ చేతిలో ఓడినా.. వర్షం కారణంగా రద్దయినా టీమిండియాపై ఒత్తిడి నెలకొంటుంది. ఈ ఒత్తిడిలో బలమైన ఆస్ట్రేలియాను ఓడించడం చాలా కష్టం. అఫ్గానిస్థాన్‌కు కూడా సెమీస్ చేరే అవకాశాలున్నాయి. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధిస్తే సెమీస్‌కు అర్హత సాధించనుంది.