Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: సెమీస్, ఫైనల్లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?

టీ20 ప్రపంచకప్ 2024 తుది దశకు చేరింది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. ఇప్పటికే విజయవంతంగా గ్రూప్ దశ ముగిసి కీలకమైన సూపర్ 8 దశ ప్రారంభమైంది. మొత్తం 20 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో సూపర్-8కు 8 జట్లు అర్హత సాధించాయి. ఈ 8 జట్లు గ్రూప్-1, గ్రూప్-2గా విడిపోయి సూపర్-8 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌ల్లోని ఇతర జట్లతో మూడేసి మ్యాచ్‌లు ఆడుతాయి.

ఈ మూడు మ్యాచ్ పూర్తయిన అనంతరం ప్రతీ గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-1 టాపర్, గ్రూప్-2 రన్నరప్‌తో తొలి సెమీఫైనల్, గ్రూప్-2 టాపర్, గ్రూప్-1 రన్నరప్‌తో రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. అయితే ఈ సూపర్-8 మ్యాచ్‌లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సూపర్ మ్యాచ్‌లకు వర్షం ముప్పు ఉంది.

T20 World Cup 2024 What Happens If Weather Interrupts Play in Semis and Final

పొంచి ఉన్న వర్షం ముప్పు..
ఇప్పటికే ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. డక్ వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. రూల్స్ ప్రకారం మ్యాచ్ సమయంలో వర్షం లేదా ప్రతికూల వాతావరణం ఏర్పడితే, ఫలితాన్ని నిర్ణయించడానికి కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిగేలా చూస్తారు. మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ పెడతారు. కటాఫ్ సమయంలో ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ ఆడిస్తారు.

అదేవిధంగా మొదటి సెమీ-ఫైనల్, ఫైనల్‌కు రిజర్వ్ డే ఉండగా.. రెండో సెమీ-ఫైనల్‌కు మాత్రం రిజర్వ్ డే లేదు. ఫైనల్, రెండో సెమీ-ఫైనల్ మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో రిజర్వ్ డే పెట్టలేదు. కానీ, ఆ రోజు సెమీస్ ఆడటానికి అదనపు సమయం కేటాయించారు.

250 నిమిషాల అదనపు సమయం..
ప్రతి సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు 250 నిమిషాల (4 గంటల 10 నిమిషాలు) అదనపు సమయం కేటాయించారు. 26వ తేదీన తొలి సెమీఫైనల్ జరగనుంది, వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే ఆ రోజు 60 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఈ సమయంలోపు కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ను అయిన నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు.

ఒకవేళ అప్పటికీ మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజు మ్యాచ్ జరుగుతుంది. రిజర్వ్ డేకు 190 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. అమెరికాలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 27న రెండో సెమీఫైనల్ జరగనుంది. అయితే, వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే ఆ రోజు అదనంగా 250 నిమిషాల సమయం కేటాయించారు. కానీ మరుసటి రోజు మ్యాచ్ నిర్వహించేందుకు రిజర్వ్ డే ఇవ్వలేదు.

ఫైనల్ రద్దయితే..?
ఫైనల్‌ మ్యాచ్ జూన్ 29న జరుగుతుంది. జూన్ 30 రిజర్వ్ డేగా నిర్ణయించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ 190 నిమిషాల్లో ముగియాలి. తొలి సెమీఫైనల్‌, ఫైనల్‌లో 10 ఓవర్లు మాత్రమే ఆట జరిగి, వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోతే మళ్లీ రిజర్వ్‌ డేలో కొత్త మ్యాచ్‌ జరగదు. మ్యాచ్ ఆగిపోయిన ఓవర్ నుంచి ఆట తిరిగి ప్రారంభిస్తారు.

ఒకవేళ సెమీ-ఫైనల్‌కు వాతావరణం అడ్డంకిగా మారితే, సెకండ్ రౌండ్ గ్రూపు దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఫైనల్లో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే మాత్రం ఇరు జట్లను విజేతలను ప్రకటిస్తారు.

Story first published: Friday, June 21, 2024, 17:35 [IST]
Other articles published on Jun 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+