Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: తొలి మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి రంగం సిద్దమైంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా మరో 48 గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. మే 2(ఆదివారం)న జరిగే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా, కెనడా తలపడుతున్నాయి. డల్లాస్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్.. భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ మెగా మ్యాచ్‌కు టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముపు పొంచి ఉంది. ఇప్పటికే ఈ మైదానం వేదికగా జరగాల్సిన నాలుగు వామప్ మ్యాచ్‌ల్లో మూడు వర్షార్పణం అయ్యాయి.

T20 World Cup 2024 USA vs Canada opening match faces rain threat

ఈ మైదానంలో నేపా‌ల్‌తో జరిగిన తొలి వామప్ మ్యాచ్‌లో కెనడా 63 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత జరగాల్సిన బంగ్లాదేశ్ వర్సెస్ అమెరికా, అమెరికా వర్సెస్ నేపాల్, నెదర్లాండ్స్ వర్సెస్ కెనడా వామప్ మ్యాచ్‌లు బంతి పడకుండానే రద్దయ్యాయి.

ఈ క్రమంలోనే జూన్ 2న జరిగే టీ20 ప్రపంచకప్ 2024 తొలి మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం టెక్సాస్‌లో ప్రతీ రోజు వర్షం కురుస్తోంది. తొలి మ్యాచ్ జరిగే జూన్2న కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.

Weather.com వివరాల ప్రకారం జూన్ 2న టెక్సాస్‌లో21 నుంచి 24 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ రోజు ఆకాశమంతా మబ్బులు కమ్ముకోనున్నాయి. స్వల్ప స్థాయిలో వర్షం పడినా మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతీ రోజు వర్షం పడుతుండటంతో మైదానం చిత్తడిగా మారింది. ఆ రోజు స్వల్ప స్థాయిలో వర్షం పడినా.. ఆటకు మైదానాన్ని సిద్దం చేయలేని పరిస్థితి ఉంటుంది.

Story first published: Friday, May 31, 2024, 18:20 [IST]
Other articles published on May 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+