Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024 కౌంట్ డౌన్ షురూ.. టీమిండియాలో తీవ్ర పోటీ!

T20 World Cup 2024: వన్డే ప్రపంచకప్ 2023 ముగియడంతో అందరి చూపు అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌పై పడింది. వచ్చే ఏడా జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న ఈ పొట్టి కప్ కోసం జట్లన్నీ తమ కార్యచరణను ప్రారంభించాయి. ఇప్పటికే తమ సన్నాహకాలను ప్రారంభించిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ ముందు పది మ్యాచ్‌లే ఆడనుంది.

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడిన టీమిండియా.. సౌతాఫ్రికాతో మూడు, అఫ్గానిస్థాన్‌తో మరో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఐపీఎల్ జరగనుండగా.. ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగియగానే టీ20 ప్రపంచకప్ కోసం బయల్దేరనుంది. టీమ్ కాంబినేషన్‌ను సెట్ చేసుకునేందుకు టీమిండియాకు ఈ పది మ్యాచ్‌లే ఆప్షన్.

 T20 World Cup 2024: Team India take shape with just 10 matches left

ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఒకటి రెండు మార్పులు చేసినా.. టీమ్ మొత్తాన్ని మాత్రం మార్చలేరు. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. మరోసారి పొట్టికప్‌ను అందుకోలేకపోయింది. ఈ సారైనా ఆ నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ 2023 కోసం బీసీసీఐ.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ జట్టును సిద్దం చేస్తోంది.

ఇప్పటికే పలు సిరీస్‌లను సీనియర్ ఆటగాళ్లు లేకుండా కుర్రాళ్లతోనే ఆడించింది. అయితే వన్డే ప్రపంచకప్ ప్రదర్శన నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని సీనియర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం టీమ్ ఫామ్ ప్రకారం బౌలర్లను మినహాయిస్తే టాప్ 6లో మూడుస్థానాలకు ప్లేసులు ఖాయమయ్యాయి.

నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంలో రింకూ సింగ్ చోటు దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ఆడటం కూడా ఖాయం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సుముఖంగా ఉండి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఈ ఇద్దరూ కూడా బరిలోకి దిగుతారు.

అలా కాకుంటే మాత్రం ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఆడటం ఖాయం. కానీ మిగతా నాలుగు ప్లేస్‌లు ఎవరా? అనేది కాలమే సమాధానం చెప్పాలి. బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న బౌలర్లకే ప్రాధాన్యత లభించనుంది.

Story first published: Friday, November 24, 2023, 18:31 [IST]
Other articles published on Nov 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+