Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: పాక్ జర్నలిస్ట్‌ ఎకసెక్కాలు.. నోరు మూయించిన రైనా!

టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నర్ సురేశ్ రైనాను ఓ పాకిస్థాన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎక్స్ వేదికగా ట్రోల్ చేశాడు. దీనికి రైనా తనదైన శైలిలో బదులిచ్చాడు. అదిరిపోయే సమాధానంతో సదరు పాక్ జర్నలిస్ట్‌ నోరు మూయించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి. సురేశ్ రైనా సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అసలేం జరిగిందంటే.?
ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం సురేశ్ రైనా కామెంటేటర్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. హిందీ వ్యాఖ్యానంతో అభిమానులను అలరిస్తున్నాడు. తనదైన ఛలోక్తులతో పాటు సీఎస్‌కే మాజీ ఆటగాడిగా.. ధోనీ సన్నిహితుడిగా తన జ్ఞాపకాలను పంచుకుంటున్నాడు. కామెంట్రీలో ఆరితేరిన సురేశ్ రైనాను ఓ మ్యాచ్ సందర్భంగా ఆకాశ్ చోప్రా రిటైర్మెంట్‌పై పునరాచోలన చేస్తావా? అని ప్రశ్నించాడు.

T20 World Cup 2024 Suresh Raina hits back at Pakistan journalist over Shahid Afridi ambassador post

దానికి రైనా.. యూటర్న్ తీసుకునేందుకు తాను ఏమైనా షాహిద్ అఫ్రిదినా? అని ప్రశ్నించాడు. షాహిద్ అఫ్రిది తన కెరీర్‌లో చాలా సార్లు రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అఫ్రిది పేరు చెప్పి రైనా నవ్వులు పూయించాడు. ఇక రైనా కామెంట్స్‌ను మనసులో పెట్టుకున్న పాకిస్థాన్ స్పోర్ట్స్ కంటెంట్ రైటర్ ఇమ్రాన్ సిద్దిఖ్ అదును కోసం ఎదురు చూసి.. రైనాను ట్రోల్ చేశాడు.

ఇటీవల షాహిది అఫ్రిదిని ఐసీసీ.. టీ20 ప్రపంచకప్‌కు ప్రచారకర్తగా ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సురేశ్ రైనాను ఇమ్రాన్ ఎగతాళి చేసే ప్రయత్నం చేశాడు. 'షాహిద్ అఫ్రిదిని ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ అంబాసిడర్‌గా ప్రకటించింది. హలో సురేశ్ రైనా ఇప్పుడు ఏం అంటావ్?'అని ట్వీట్ చేశాడు.

ఇందుకు సురేశ్ రైనా దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. 'నేనేం ఐసీసీ ప్రచారకర్తను కాదు. కానీ 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిని. మోహాలీలో మేం ఆడిన మ్యాచ్ గుర్తుందా? నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు మరిచిపోలేని జ్ఞాపకాలను గుర్తు చేస్తుందనుకుంటా?' అని నోరు మూయించాడు.

2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో షాహిద్ అఫ్రిది సారథ్యంలోని పాకిస్థాన్‌ను భారత్ 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 ప్రపంచకప్ 2024కు ఐసీసీ షాహిద్ అఫ్రిది, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్‌తో పాటు ఉసెన్ బోల్ట్‌లను ఐసీసీ ప్రచారకర్తలుగా ప్రకటించింది.

Story first published: Friday, May 24, 2024, 18:28 [IST]
Other articles published on May 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+