Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: శ్రీలంకదే బ్యాటింగ్.. తుది జట్లు ఇవే!

టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయనే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీలంక కెప్టెన్ వానిందు హసరంగా తెలిపాడు. తాము ఏడుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. మా బౌలింగ్ విభాగం బలంగా ఉంది. దాంతోనే బ్యాటింగ్ తీసుకున్నాం. గత నెలనే నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. నేను అన్ని విధాల సిద్దంగా ఉన్నాను. మా జట్టులోని కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ ఆడి వచ్చారు.

T20 World Cup 2024 Sri Lanka wins the toss and opts to bat first vs South Africa

మేం ఇక్కడ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాం. ఏడుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. ఇందులో ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉన్నారు.

మరోవైపు టాస్ గెలిచినా తాము బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు. పిచ్‌పై తమకు క్లారిటీ లేదని, అందుకే ముందుగా బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని చెప్పాడు. 'గత కొన్నేళ్లుగా మా జట్టు సమష్టిగా రాణిస్తోంది. వన్డే ప్రపంచకప్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఇక్కడి సౌకర్యాలు బాగున్నాయి. ఈ టోర్నీలో మాకు అన్ని అనుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నా. మేం నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు.

తుది జట్లు:

శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్, కామిందు మెండీస్, సదీర సమర‌విక్రమా, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, డసన్ షనక, వానిందు హసరంగా, మహీష్ తీక్షణ, మతీష పతీరణ, నువాన్ తుషారా

సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, రిజా హెండ్రీక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్, ఓట్‌నీల్ బార్ట్‌మన్

Story first published: Monday, June 3, 2024, 20:15 [IST]
Other articles published on Jun 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+