Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024 పూర్తి షెడ్యూల్ ఇదే.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?

ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. జూన్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీ వివరాలను ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఐసీసీ శుక్రవారం వెల్లడించింది. ఆయా దేశాల అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ లైవ్ ద్వారా ఈ షెడ్యూల్‌ వివరాలను అభిమానులతో పంచుకున్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 దేశాల మధ్య ఈ టీ20 ప్రపంచకప్ జరగనుంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.

T20 World Cup 2024 Schedule: India face Pakistan on June 9 in New York

గ్రూప్‌-ఏలో భారత్, పాకిస్థాన్‌తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ ఉండగా.. గ్రూప్-బి‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్‌లాండ్, ఓమన్, గ్రూప్-సీలో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండ, పపువా న్యూగెనియా, గ్రూప్-డీలో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు తలపడనున్నాయి.

జూన్ 1 నుంచి 18 వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నాలుగు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. జూన్ 19 నుంచి 24 వరకు సూపర్ 8 మ్యాచ్‌లు జరగుతాయి. టాప్-4లో నిలిచిన జట్లు జూన్ 26(గయానా), 27(ట్రినిడాడ్) తేదిల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడుతాయి. జూన్ 29న బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

అగ్రరాజ్యం అమెరికా, కెనడా మధ్య ఈ జూన్ 1న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా ఆడనుంది. జూన్ 9న దాయాదీ పాకిస్థాన్‌తోనే న్యూయార్క్ వేదికగా భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

జూన్ 12న న్యూయార్క్ వేదికగానే ఆతిథ్య అమెరికాతో తలపడనుంది. జూన్ 15న కెనడాతో ఫ్లోరిడా వేదికగా చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.గ్రూప్ స్టేజీలో టీమిండియా షెడ్యూల్:

ఇండియా వర్సెస్ ఐర్లాండ్ జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జూన్ 9 (న్యూయార్క్)
ఇండియా వర్సెస్ యూఎస్ఏ జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా వర్సెస్ కెనడా జూన్ 15 (ఫ్లోరిడా)

Story first published: Friday, January 5, 2024, 19:43 [IST]
Other articles published on Jan 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+