టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది.
ఈ గాయం తీవ్రత గురించి స్పష్టత లేకున్నా.. పాకిస్థాన్‌తో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. టోర్నీలోని భవిష్యత్తు మ్యాచ్‌ల నేపథ్యంలో రోహిత్ శర్మ గాయం పెద్దది అవ్వకుండా విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే రోహిత్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ పరిస్థితుల్లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజన గణేశన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఓ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. 'జస్‌ప్రీత్ బుమ్రా టాస్ వేయడం చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా'అని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఈ పోస్ట్ రోహిత్ శర్మ అభిమానులతో పాటు నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తోంది.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమైనా.. వైస్ కెప్టెన్ హోదాలో హార్దిక్ పాండ్యా టీమిండియాను నడిపిస్తాడు కదా..? మరీ బుమ్రా ఎందుకు టాస్ వేస్తాడని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. సంజనా గణేశన్.. ఏదైనా బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా ఈ పోస్ట్ చేసి ఉండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనా సంజనా పోస్ట్ రోహిత్ శర్మ అభిమానులను కలవరపెడుతోంది.
ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ తన గాయం తీవ్రతపై క్లారిటీ ఇవ్వలేదు. నొప్పిగానే ఉన్నట్లు తెలిపాడు. ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమైతే.. అతనిస్థానంలో యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వస్తాడు.
ఐర్లాండ్‌పై భారీ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన టీమిండియా.. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌కు సిద్దమయ్యింది. ఎలాంటి టెన్షన్ లేకుండా సూపర్-8కు టీమిండియా క్వాలిఫై కావాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. టీమిండియా తమ చివరి రెండు లీగ్ మ్యాచ్‌లను కెనడా, అమెరికాతో జూన్ 12, జూన్ 15న తలపడనుంది.