టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ట్రేడ్ మార్క్ సిక్సర్‌తో అలరించాడు. టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. షోరిఫుల్ ఇస్లామ్ వేసిన నాలుగో ఓవర్‌లో తన ట్రేడ్ మార్క్ ఫ్లిక్ షాట్‌తో సిక్సర్ బాదాడు.
ఈ ఓవర్ చివరి బంతిని షోరిఫుల్ ఇస్లామ్.. లెగ్ స్టంప్ దిశగా వేయగా.. రోహిత్ శర్మ ఫ్లిక్ షాట్‌తో డీప్ బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ తరలించాడు. ఈ సిక్స్‌కు షోరిఫుల్ ఇస్లామ్ బిత్తరపోయాడు. ఈ వీడియోను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా.. ఈ ఫ్లిక్ షాట్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్స్ చూస్తున్నామని, మెగా టోర్నీలో ఇదే జోరు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23 పరుగులే చేసి వెనుదిరిగాడు. మహ్మదుల్లా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
దూకుడుగా ఆడిన రిషభ్ పంత్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా.. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్(1) తీవ్రంగా నిరాశపరిచాడు.
ఈ సన్నాహక మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. శనివారం ఉదయమే జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీకి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు విశ్రాంతినిచ్చామని రోహిత్ తెలిపాడు.