టీ20 ప్రపంచకప్ 2024 ముందు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసేందుకు ఎలాంటి కారణం లేదని, కండిషన్స్‌ను అర్థం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ సన్నాహక మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడని రోహిత్ చెప్పాడు.
ఈ రోజే విరాట్ కోహ్లీ.. టీమిండియాతో కలిసాడని, ఇక్కడి పరిస్థితులు, కాలానికి అలవాటు పడేందుకు అతనికి కొంచెం టైమ్ పడుతుందన్నాడు. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నాడని, అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదని తెలిపాడు.

ఐపీఎల్ 2024 సీజన్ అనంతరం కుటుంబంతో గడిపిన విరాట్ కోహ్లీ.. శుక్రవారమే సతీసమేతంగా అమెరికా ఫ్లైట్ ఎక్కాడు. ఈ ఉదయం అక్కడికి చేరుకున్న అతను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో సంజూ శాంసన్.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు. ఈ సన్నాహక మ్యాచ్‌కు కోహ్లీ మినహా 14 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.
సన్నాహక మ్యాచ్ కాబట్టి ఎంతమందైనా ఆడటానికి వీలు ఉంటుంది. కాకపోతే 11 మంది మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు టస్కిన్, ముస్తాఫిజుర్‌లకు రెస్ట్ ఇచ్చింది. మిగతా 13 మంది ఆటగాళ్లు ఈ సన్నాహక మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నారు. అయితే సంజూ శాంసన్(1) తీవ్రంగా నిరాశపరిచాడు. షోరిఫుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి పంత్ రాగా.. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు.
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
బంగ్లాదేశ్: తంజీద్ హసన్, సౌమ్యా సర్కార్, లిటన్ దాస్, నజ్ముల్ హుస్సెన్ షాంటో, షకీబ్ అల్ హసన్, టౌహిడ్ హృదయ్, మహ్మదుల్లా, జేకర్ అలీ, తన్వీర్ ఇస్లామ్, మహేది హసన్, రిషద్ హొస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, తంజీమ్ హసన్ షకీబ్