Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: ఇంగ్లండ్ X స్కాట్లాండ్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం!

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా స్కాట్లాండ్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగానే ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన స్కాట్లాండ్ ముందుగా బ్యాటింగ్ దిగగా.. 6.2 ఓవర్ల ఆట జరగ్గానే మళ్లీ వర్షం వచ్చింది. దాంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు.

ఆట ఆగిపోయే సమయానికి స్కాట్లాండ్ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. మధ్యలో వర్షం ఆగిపోగా.. గ్రౌండ్స్‌మెన్ కవర్లను తొలగించి మైదానాన్ని ఆటకు రెడీ చేసే ప్రయత్నం చేశారు. కానీ మళ్లీ వర్షం రావడంతో వారి ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.

T20 World Cup 2024 Rain stops play as Scotland are 51 0 England get frustrated

ప్రస్తుతం మైదానంలోని పరిస్థితులను చూస్తుంటే ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రూల్స్ ప్రకారం కనీసం 5 ఓవర్ల ఆట సాధ్యమైనా ఆడిస్తారు. లేకుంటే ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు.

అంతకుముందు టాస్ సందర్భంగా జోస్ బట్లర్ మాట్లాడుతూ.. తాము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని తెలిపాడు. టాస్ ఓడినా మేం కోరుకున్నదే దక్కిందని చెప్పాడు. ఈ టోర్నీ కోసం జట్టులో ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారని, జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపాడు. అతని నుంచి తాము అద్భుత ప్రదర్శనను ఆశిస్తున్నామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తాము ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగుతున్నామని, మార్క్ వుడ్, జోర్డాన్ తుది జట్టులోకి వచ్చారని చెప్పాడు.

పిచ్ కండిషన్స్ నేపథ్యంలో తాము ముందుగా బ్యాటింగ్ తీసుకున్నామని స్కాట్లాండ్ కెప్టెన్ రీచీ బెర్రింగ్టన్ తెలిపాడు. మ్యాచ్ జరుగుతున్న కొద్ది వికెట్ మారే అవకాశం ఉందన్నాడు. అయితే పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ నమోదు చేయడం ముఖ్యమన్నాడు. టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నామని, ఈ గొప్ప ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటామని తెలిపాడు.

తుది జట్లు:

ఇంగ్లండ్: జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, విల్ జాక్స్, జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

స్కాట్లాండ్: జార్జీ మున్సే, మైఖల్ జోన్స్, బ్రెండన్ మెక్‌ముల్లెన్, రిచీ బెర్రింగ్టన్, మాథ్యూ క్రాస్, మైకెల్ లీస్క్, క్రిస్ గ్రేవ్స్, మార్క్ వాట్, క్రిష్టోఫర్ సోలే, బ్రాండ్ వీల్, బ్రాడ్లీ కర్రీ

Story first published: Tuesday, June 4, 2024, 22:19 [IST]
Other articles published on Jun 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+