For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2024: పాకిస్థాన్ చెత్త రికార్డ్!

టీ20 ప్రపంచకప్‌ 2024లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్థాన్ జట్టు తమ పేరిట చెత్త రికార్డును లిఖించుకుంది. ఆతిథ్య అమెరికా జట్టుతో గురువారం అర్థరాత్రి జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపాలైంది.

సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో పసికూన అమెరికా చేతిలో పాకిస్థాన్ చిత్తయ్యింది. ఈ ఓటమితో టీ20 ప్రపంచకప్‌ల్లో టై అయిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పొందిన జట్టుగా పాకిస్థాన్ అప్రతిష్టను మూటగట్టుకుంది.

T20 World Cup 2024 Pakistan creates unwanted record after USA beat in Super Over

తొలి జట్టుగా అప్రతిష్ట..
అరంగేట్ర టీ20 ప్రపంకప్‌లో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ టై అవ్వగా.. బౌల్ ఔట్‌లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. అప్పటి సూపర్ ఓవర్‌ నిబంధనను లేకపోవడంతో ఫలితాన్ని బౌల్ ఔట పద్దతిన తేల్చారు. తెలివిగా ఆలోచించిన ధోనీ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి ఫలితాన్ని రాబట్టాడు.

17 ఏళ్ల తర్వాత తాజా టీ20 ప్రపంచకప్‌లో అమెరికాతో టై చేసుకున్న పాకిస్థాన్.. సూపర్ ఓవర్‌లో విజయాన్ని అందుకోలేకపోయింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాలుగేసార్లు సూపర్ ఓవర్‌‌తో ఫలితం తేల్చాల్సి వచ్చింది. 2012లో కివీస్‌పై, శ్రీలంక, విండీస్‌పై న్యూజిలాండ్, ఈ ఏడాది ఒమన్‌పై నమీబియా సూపర్‌ ఓవర్‌లో గెలిచాయి.

విఫలమైన పాక్ బ్యాటర్లు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ ( 43 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), షాదాబ్ ఖాన్ ( 25 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లతో 40) రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

అమెరికా బౌలర్లలో కెంజిగె (3/30), సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/18) నిప్పులు చెరిగారు. అనంతరం అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. దాంతో ఇరు జట్లు స్కోర్లు టై అయ్యాయి.

యూఎస్‌ఏ కెప్టెన్ మొనాన్క్ పటేల్‌ (38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50), ఆరోన్‌ జోన్స్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 నాటౌట్‌), ఆంద్రీస్‌ గౌస్‌ (26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ 35) సత్తా చాటారు. మహమ్మద్ అమీర్, నసీమ్ షా, హారిస్ రౌఫ్ తలో వికెట్ తీసారు.

కొంపముంచిన హ్యారీస్ రౌఫ్, అమీర్..
ఆఖరి ఓవర్‌లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసమవ్వగా.. హ్యారీస్ రౌఫ్ డిఫెండ్ చేయలేకపోయాడు. తొలి మూడు బంతులను కట్టుదిట్టంగా వేసిన హ్యారీస్ రౌఫ్.. మూడు పరుగులే ఇచ్చాడు. అయితే నాలుగో బంతిని ఆరోన్ జోన్స్ సిక్సర్ బాది.. ఐదో బంతికి సింగిల్ తీసాడు. చివరి బంతికి 5 పరుగులు అవసమరమవ్వగా.. నితీష్ కుమార్ బౌండరీ బాది టై చేశాడు.

సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. మూడు బంతులను కట్టుదిట్టంగా వేసి ఏడు పరుగులే ఇచ్చిన మహమ్మద్ అమీర్.. ఆ తర్వాత వైడ్ యార్కర్లు వేసే ప్రయత్నంలో ఏడు పరుగులను వైడ్స్ రూపంలో సమర్పించుకున్నాడు.

అనంతరం 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ వికెట్ కోల్పోయి 13 పరుగులే చేసి ఓటమిపాలైంది. అమెరికా పేసర్ సౌరభ్‌ నేత్రావల్కర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సంచలన విజయాన్ని అందించాడు.

Story first published: Friday, June 7, 2024, 18:53 [IST]
Other articles published on Jun 7, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+