టీ20 ప్రపంచకప్ 2024 కీలక దశకు చేరింది. సక్సెస్‌ఫుల్‌గా గ్రూప్ దశ ముగిసి సూపర్-8కు తెరలేచింది. 20 దేశాలు పోటీపడిన ఈ టోర్నీలో నాలుగు గ్రూప్స్ నుంచి 8 జట్లు సూపర్-8 చేరాయి. ఈ 8 టీమ్స్ రెండు గ్రూప్‌లుగా సూపర్-8 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఉండగా.. గ్రూప్-2లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్‌లు తలపడనున్నాయి. రెండు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. వెస్టిండీస్ వేదికగా సూపర్-8 మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ మ్యాచ్‌లు అన్నింటికి వర్షం ముప్పు పొంచి ఉంది.

సూపర్-8లో ప్రతీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మూడింటిలో ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా సెమీస్ అవకాశాలు గల్లంతయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షం ముప్పు బిట్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లను కలవరపెడుతున్నాయి. తొలి సెమీఫైనల్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండగా.. రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదు.
ట్రినిడాడ్ వేదిక తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. గ్రూప్1లో టాప్‌లో నిలిచే జట్టు, గ్రూప్2లో రన్నరప్‌గా నిలిచి టీమ్ తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్ గయానా వేదికగా జూన్ 27న జరగనుండగా.. గ్రూప్ 2 టాపర్, గ్రూప్ 1 రన్నరప్ తలపడనున్నాయి.
ఫైనల్ మ్యాచ్ 29న ఉండటంతో రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించలేదు. పైగా ఈ మ్యాచ్ ఉదయం ఉన్న నేపథ్యంలో 250 నిమిషాలు వేచి చూసేందుకు అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా రెండో సెమీ ఫైనల్ గెలిచి జట్టు ఫైనల్ వేదికకు ప్రయాణించేందుకు రిజర్వ్ డే కేటాయించలేదు.
గ్రూప్-1లో ఉన్న టీమిండియా అగ్రస్థానంలో నిలవాలంటే ఆస్ట్రేలియాపై విజయం సాధించాలి. ఒకవేళ ఓడి రెండో స్థానంలో నిలిచి ఉంటే సెమీస్-2 ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా రెండో సెమీఫైనల్ రద్దయితే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్రత్యర్థి జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ విషయమే భారత అభిమానులను కలవరపెడుతోంది.