Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ పేసర్.. క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని రికార్డ్!

న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని రికార్డ్‌ను నమోదు చేశాడు. వరుసగా నాలుగు ఓవర్లు మెయిడిన్ చేసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా పసికూన పపువా న్యూ గినియాతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో లాకీ ఫెర్గూసన్ ఈ ఫీట్ సాధించాడు.

నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండా 3 వికెట్లు తీసాడు. టీ20 ప్రపంచకప్‌తో పాటు పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన ఫీట్ సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు మరే క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.

T20 World Cup 2024 Lockie Ferguson creates unbreakable record in T20I history during NZ vs PNG Match

పపువా న్యూ గినియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బంతిని అందుకున్న ఫెర్గూసన్ తొలి బంతికే వికెట్ తీసాడు. ఆ తర్వాతి ఐదు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మెయిడిన్ చేశాడు. ఏడో ఓవర్‌లో మరోసారి బౌలింగ్‌ అందుకొని రెండోసారి మెయిడిన్ చేశాడు.

మళ్లీ 12వ ఓవర్‌ బౌలింగ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి వికెట్ తీసి మూడో ఓవర్‌ను మెయిడిన్ చేశాడు. 14వ ఓవర్‌లో రెండో బంతికి మరో వికెట్ తీసి మరోసారి మెయిడిన్ చేశాడు. 2021లో కెనడా బౌలర్ సాద్ బిన్ పనామాతో జరిగిన మ్యాచ్‌లో వరుసగా నాలుగు ఓవర్లు మెయిడిన్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఫెర్గూసన్ నాలుగు ఓవర్లు మెయిడిన్ చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టి అతని రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.

ఫెర్గూసన్ ధాటికి ముందుగా బ్యాటింగ్ పపువా న్యూ గినియా 19.4 ఓవర్లలో 78 పరుగులకు కుప్పకూలింది. చార్లెస్ అమిని(17), నోర్మన్ వానువా(14), సెసే(12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, ఇష్ సోదీ రెండేసి వికెట్లు తీయగా.. ఫెర్గూస్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ సాంట్నర్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Monday, June 17, 2024, 22:59 [IST]
Other articles published on Jun 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+