Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024: రఫ్ఫాడించిన రబడా.. అమెరికాపై సౌతాఫ్రికా ఘన విజయం!

టీ20 ప్రపంచకప్ 2024లో సౌతాఫ్రికా తమ జోరును కొనసాగిస్తోంది. గ్రూప్-2 సూపర్-8లో భాగంగా బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది.

క్వింటన్ డికాక్(40 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 74) విధ్వంసకర హాఫ్ సెచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 3 సిక్స్‌లతో 36 నాటౌట్) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

Kagiso Rabada

అమెరికా బౌలర్లలో భారత్‌కు చెందిన సౌరభ్ నేత్రవల్కర్(2/21), హర్మీత్ సింగ్(2/24) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆండ్రీస్ గౌస్(47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చేసిన పోరాటం వృథా అయ్యింది. అతనికి తోడుగా హర్మీత్ సింగ్(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది.

సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(3/18) మూడు వికెట్లతో సత్తా చాటగా.. కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జ్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ తీసారు.

దూకుడుగా ఆడినా..
195 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన అమెరికా తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు స్టీవెన్ టైలర్(24), ఆండ్రీస్ గౌస్.. సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దూకుడుగా ఆడుతున్న టైలర్‌ను రబడా క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో నితీష్ కుమార్(8)ను ఔట్ చేయగా.. తాత్కలిక కెప్టెన్ ఆరోన్ జోన్స్(0)ను కేశవ్ మహరాజ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో అమెరికా 56 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఆండ్రీస్ గౌస్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కోరే అండర్సన్(12), షయన్ జహంగీర్(3) విఫలమైనా.. హర్మీత్ సింగ్‌తో కలిసి గౌస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ క్రమంలో అతను 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హర్మీత్ సింగ్ సైతం బ్యాట్‌కు పనిచెప్పడంతో అమెరికా వేగంగా పరుగులు చేసింది.

మలుపు తిప్పిన రబడా..
చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోతుండటంతో భారీ షాట్ ఆడబోయిన హర్మీత్ సింగ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 19వ ఓవర్ వేసిన రబడా హర్మీత్ సింగ్‌ను ఔట్ చేయడంతో పాటు రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో అమెరికా విజయానికి 26 పరుగులు అవసరమవ్వగా.. 7 పరుగులే చేసి ఓటమిపాలైంది.

Story first published: Wednesday, June 19, 2024, 23:30 [IST]
Other articles published on Jun 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+