Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా!

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన భారత బౌలర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా రికార్డ్ సాధించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ఆరో ఓవర్‌‌లో బంతిని అందుకున్న జస్‌ప్రీత్ బుమ్రా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఒక్క పరుగు ఇవ్వకుండా మెయిడి చేశాడు. టీ20ల్లో జస్‌ప్రీత్ బుమ్రాకు ఇది 11వ మెయిడిన్ ఓవర్‌. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ రికార్డును బుమ్రా అధిగమించాడు. బుమ్రా 63 మ్యాచ్‌ల్లో 11 ఓవర్లు మెయిడిన్ చేయగా.. భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్‌ల్లో 10 మెయిడిన్ ఓవర్లు వేసాడు.

T20 World Cup 2024 Jasprit Bumrah Creates History Breaks Bhuvneshwar Kumar s World Record In T20Is

ఈ జాబితాలో పసికూన టీమ్స్ ఉగాండ, కెన్యా బౌలర్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లతో టాప్‌లో ఉండగా.. కెన్యా బౌలర్ సోంగోచ్ 12 మెయిడిన్ ఓవర్లతో బుమ్రా కన్నా ముందున్నారు. ఐసీసీ టాప్ 8 ర్యాంక్స్‌లో జట్లలో అత్యధిక ఓవర్లు మెయిడిన్ చేసిన బౌలర్‌గా మాత్రం జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో గెరాత్ డెలానీ(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26), జోష్ లిటిల్(13 బంతుల్లో 2 ఫోర్లతో 14), కర్టిస్ కాంఫెర్(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 12) మాత్రమే రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

పిచ్ నుంచి లభించిన సహకారంతో భారత బౌలర్లు.. హార్దిక్ పాండ్యా(3/27), జస్‌ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్ దీప్ సింగ్(2/35), మహమ్మద్ సిరాజ్(1/13), అక్షర్ పటేల్(1/3) నిప్పులు చెరిగారు.

అనంతరం లక్ష్యచేధనకు టీమిండియా 12.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాగా.. రిషభ్ పంత్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) సత్తా చాటాడు.

విరాట్ కోహ్లీ(1), సూర్యకుమార్ యాదవ్(2) తీవ్రంగా నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, బెన్ వైట్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, June 5, 2024, 22:41 [IST]
Other articles published on Jun 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+