T20 World Cup 2024: భారత జట్టులో దినేశ్ కార్తీక్.. ఇంపాక్ట్ రూల్ లేదంటూ ఇర్ఫాన్ పఠాన్ సెటైర్స్!
ఐపీఎల్ 2024 సీజన్‌లో సత్తా చాటుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. నిలకడగా ఆడుతూ.. తనదైన శైలిలో మ్యాచ్‌లను ముగిస్తున్న దినేశ్ కార్తీక్‌ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయాలని అంబటి రాయుడు వంటి మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
అయితే రాయుడి వ్యాఖ్యలను మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తప్పుబట్టాడు. ఐపీఎల్, ప్రపంచకప్‌కు చాలా తేడా ఉంటుందని, ఐసీసీ టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేదని గుర్తు చేస్తూ సెటైర్లు పేల్చాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు. 288 పరుగుల భారీ లక్ష్యచేధనలో చివరి వరకు పోరాడాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేసి ఆర్‌సీబీని గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ నటరాజన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన దినేశ్ కార్తీక్ 226 పరుగులు చేశాడు. అయితే ఆరంభంలో దినేశ్ కార్తీక్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు.
కార్తీక్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించిన అంబటి రాయుడు.. అతన్ని టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లకు సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి పాల్గొన్న రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
'దినేశ్ కార్తీక్ తన కెరీర్‌లో ఎక్కువగా ధోనీతో పోటీ పడ్డాడు. ధోనీ కెప్టెన్‌గా సక్సెస్ కావడంతో కార్తీక్‌కు అవకాశం లేకుండా పోయింది. దినేశ్ కార్తీక్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కెరీర్ చివరి దశలో ఉన్న అతనికి వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కుతుందని భావిస్తున్నాను.
అతనికి అవకాశం ఇస్తే మ్యాచ్ విన్నర్‌గా మారుతాడు. అంతేకాకుండా భారత్‌కు ప్రపంచకప్ అందించి తన కెరీర్‌ను ఘనంగా ముగిస్తాడు. సెలెక్టర్లు అతన్ని ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నా.'అని రాయుడు అన్నాడు.
అంబటి రాయుడు వ్యాఖ్యలతో నవ్వుకున్న పఠాన్.. అతని అభిప్రాయాన్ని విభేదించాడు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌కు చాలా తేడా ఉంటుందని తెలిపాడు. పైగా ఐసీసీ టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ కంటే తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని చెప్పాడు.
ఐపీఎల్ 2022 ప్రదర్శన ఆధారంగా దినేశ్ కార్తీక్‌ను టీ20 ప్రపంచకప్ 2022 జట్టులోకి తీసుకోగా.. అతను దారుణంగా విఫలమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications