Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే భారత జట్టు‌‌లో స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ‌కు జతగా యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా బీసీసీఐ పరిగిణిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 1-29 వరకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

ఈ టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ).. మే 1ని డెడ్‌లైన్‌గా విధించింది. ఇప్పటికే అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ.. టీ20 ప్రపంచకప్‌ ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది. ఇటీవలే ఢిల్లీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సమావేశమై తుది జట్టు ఎంపికపై సుదీర్ఘ చర్చలు చేసింది.

T20 World Cup 2024 IPL 2024 form unlikely to heavily influence in India squad selection

టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో ఐపీఎల్ 2024 సీజన్ ఫామ్‌ను పెద్దగా పట్టించుకోలేదని ప్రముఖ క్రికెట్ వెబ్‌‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో తెలిపింది. ఈ కథనం ప్రకారం.. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు తెలుగు తేజం తిలక్ వర్మకు సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించినట్లు తెలుస్తోంది.

టాపార్డర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, రిషభ్ పంత్‌ను ఎంపిక చేశారని, ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను పరిగణించనున్నారని తెలుస్తోంది. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే ఆడనుండగా.. స్పెషలిస్ట్ ఫినిషర్‌గా రింకూ సింగ్ ఎంపికైనట్లు సమాచారం.

స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు యుజ్వేంద్ర చాహల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా కొనసాగనుండగా.. మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్‌ల మధ్య పోటీ నెలకొంది. రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, కేఎల్ రాహుల్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు(అంచనా):

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్/ఆవేశ్ ఖాన్.

Story first published: Monday, April 29, 2024, 18:21 [IST]
Other articles published on Apr 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+