T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పరుగుల చిరుత.!
టీ20 ప్రపంచకప్ 2024 ప్రచారకర్తగా జమైకన్ పరుగుల చిరుత, 8 టైమ్ ఒంపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఉసెన్ బోల్ట్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నియమించింది. అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జూన్ 1 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే.
ఇక ప్రపంచవ్యాప్తంగా టీ20 ప్రపంచకప్ 2024కు ఆదరణ తీసుకొచ్చేందుకు వరల్డ్ బెస్ట్ స్ప్రింటర్ అయిన ఉసెన్ బోల్డ్‌ను ఐసీసీ ప్రచార కర్తగా ఎంచుకుంది.

స్ప్రింటర్‌గా ఉసెన్ బోల్ట్ సంచలన రికార్డులు నమోదు చేశాడు. 2016 రియో ఓలింపిక్స్‌లో మూడు విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించి.. ట్రిపుల్ ట్రిపుల్ రికార్డు నమోదు చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఉసెన్ బోల్ట్.. 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల రిలే విభాగాల్లో బంగారు పతకాలు సాధించాడు. 9.58 సెకన్లలోనే 100 మీటర్లు, 19.19 సెకన్లలోనే 200 మీటర్లు, 36.84 సెకన్లలోనే 4x100 మీటర్ల రేసును పూర్తి చేసి ఛాంపియన్‌గా నిలిచాడు.
టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి 18 వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నాలుగు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. జూన్ 19 నుంచి 24 వరకు సూపర్ 8 మ్యాచ్‌లు జరగుతాయి. టాప్-4లో నిలిచిన జట్లు జూన్ 26(గయానా), 27(ట్రినిడాడ్) తేదిల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడుతాయి. జూన్ 29న బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
భారత్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా ఆడనుంది. జూన్ 9న దాయాదీ పాకిస్థాన్‌తోనే న్యూయార్క్ వేదికగా భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరో వారం రోజుల్లో భారత ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications