Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: వారి వల్లే ఫామ్ కోల్పోయిన హార్దిక్ పాండ్యా!

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలవాలంటే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటడం చాలా ముఖ్యం. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో అతను రాణిస్తేనే భారత్‌కు టైటిల్ గెలిచే అవకాశాలు పెరుగుతాయి. హార్దిక్ పాండ్యా ఫామ్‌లోకి వస్తే టీమ్ కాంబినేషన్ కూడా సరిగ్గా కుదురుతోంది.

పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు అదనపు బ్యాటర్ లేదా బౌలర్‌ను తీసుకునే అవకాశం కెప్టెన్ రోహిత్ శర్మకు దక్కుతుంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. గాయంతో అతను మధ్యలో వెనుదిరగడంతో టీమిండియాకు బలహీనతగా మారింది. మరోసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దంటే పేస్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా రాణించడం చాలా కీలకం.

T20 World Cup 2024 Hardik Pandya form affected by Rohit Sharma fans in IPL 2024

అయితే ఐపీఎల్ 2024 సీజన్‌లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానుల కారణంగా అతను తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌లో ఉన్న హార్దిక్ పాండ్యాను.. క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తెచ్చుకుంది.

ఆ వెంటనే అతనికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. అప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లకు ఈ నిర్ణయం నచ్చలేదు. బహిరంగంగానే వారు తమ అసంతృప్తిని తెలియజేశారు. రోహిత్ శర్మ అభిమానులు అయితే హార్దిక్ పాండ్యాను ఓ శత్రువులా చూస్తూ విమర్శలు గుప్పించారు. ప్రతీ మ్యాచ్ సందర్భంగా రోహిత్ రోహిత్ అని గట్టిగా అరుస్తూ గెలి చేశారు.

T20 World Cup 2024 Hardik Pandya form affected by Rohit Sharma fans in IPL 2024

అతని తప్పిదాలను భూతద్దంలో పెట్టి ట్రోల్ చేశారు. దాంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన అతను దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్‌ల్లో 198 పరుగులు మాత్రమే చేశాడు. వినోదాత్మక టోర్నీ అయిన ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ జట్టు కోసం భారత ఆటగాడైన హార్దిక్ పాండ్యా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారు.

ఇది ఇప్పుడు టీమిండియాకు సమస్యగా మారింది. మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. ఆలోపు హార్దిక్ పాండ్యా ఫామ్‌లోకి రావాల్సి ఉంది. లేకుంటే ఆ పాపం రోహిత్ శర్మ అభిమానులకే తగులుతుందని హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

Story first published: Tuesday, May 7, 2024, 17:26 [IST]
Other articles published on May 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+