Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: ఛీటింగ్ చేయడంపై స్పందించిన గుల్బాదిన్ నైబ్.. ఏమన్నాడంటే?

తాను చేసిన ఛీటింగ్‌పై అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ స్పందించాడు. తాను చేసిన మోసానికి ఏ మాత్రం పశ్చాతాపం వ్యక్తం చేయకుండా సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి సూపర్-8 మ్యాచ్‌లో అఫ్టానిస్థాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ గెలుపుతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో గుల్బాదిన్ అంపైర్లతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను దారుణంగా మోసం చేశాడు. మ్యాచ్ సమయాన్ని వృథా చేయాలనే ఉద్దేశంతో తొడ కండరాల గాయమైనట్లు డ్రామా ఆడాడు. సినీ తరహాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.

T20 World Cup 2024 Gulbadin Naib responds to R Ashwin red card demand for his cheating allegations

ఆస్కార్ యాక్టింగ్..
బంగ్లాదేశ్ విజయానికి 48 బంతుల్లో 33 పరుగులు అవసరమవ్వగా.. చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. అప్పటికే వరుణుడు చాలా సార్లు ఆటకు అంతరాయం కలిగించాడు. అప్పటికీ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం అఫ్గాన్‌దే పైచేయిగా ఉంది. దాంతో అఫ్గానిస్థాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ టైంపాస్ చేయాలని ఆటగాళ్లకు సూచించాడు.

స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బాదిన్ నైబ్.. కోచ్ సైగలను పసిగట్టి డ్రామాకు తెరలేపాడు. తొడకండరాల పట్టేశాయని ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. దాంతో ఫిజియోలు మైదానంలోకి రాగా మ్యాచ్ ఆగిపోయింది. మరోవైపు వర్షం కూడా ఎక్కువ కావడంతో అంపైర్లు ఆటను ఆపేసారు.
పది నిమిషాల తర్వాత తిరిగిన మ్యాచ్ ప్రారంభమవ్వగా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 48 బంతుల్లో 33 పరుగుల నుంచి 42 బంతుల్లో 32 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు.

బ్రావో ట్రైనింగ్..
అఫ్గానిస్థాన్ డ్రామా కారణంగా బంగ్లాదేశ్ ఒక్క పరుగుకు ఓవర్‌‌ను నష్టపోయింది. అదే సమయంలో అఫ్గాన్ బౌలర్లకు ఆ జట్టు బౌలింగ్ కోచ్ డ్వాన్ బ్రావో.. కీలక సూచనలు చేశాడు. క్రీజులో ఉన్న బ్యాటర్‌ను ఎలా ఔట్ చేయాలో చెప్పాడు. ఇది ఆ జట్టుకు కలిసొచ్చింది. అఫ్గాన్ విజయానంతరం చిరుత పులిలా గుల్బాదిన్ వేగంగా పరుగెత్తడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అశ్విన్ సెటైర్స్..
టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ప్రముఖ కామెంటేటర్ సైమన్ డౌల్ గుల్బాదిన్ యాక్టింగ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుల్బాదిన్‌కు రెడ్ కార్డ్ ఇవ్వాలని అశ్విన్ కామెంట్ చేయగా.. తొడ కండరాల గాయంతో వికెట్ తీసిన తొలి బౌలర్ గుల్బాదిన్ అని మైకేల్ వాన్ సెటైర్లు పేల్చాడు.

సైమన్ డౌల్ అయితే గుల్బాదిన్‌కు చికిత్స చేసిన ఫిజియోల వివరాలు చెప్పాలని, తాను చాలా రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, అతనికి చూపించుకుంటానని తెలిపాడు. అశ్విన్ ట్వీట్‌పై గుల్బాదిన్ స్పందించాడు. 'కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం'అన్న విధంగా తన పరిస్థితి ఉందని బాలీవుడ్ మూవీ పేరుతో బదులిచ్చాడు.

Story first published: Tuesday, June 25, 2024, 20:11 [IST]
Other articles published on Jun 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+