Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024 Final: టీమిండియా గెలవాలంటే.. ఈ మూడు చేయాలి!

టీ20 ప్రపంచకప్ 2024లో మెగా పోరుకు రంగం సిద్దమైంది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ మెగా ఫైనల్లో భారత్, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు అజేయంగా ఫైనల్ చేరాయి. దాంతో ఫైనల్ మ్యాచ్ హోరా హోరీగా సాగనుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమిండియా.. మళ్లీ టైటిల్ గెలవలేదు.

2014లో ఫైనల్ చేరి శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత టీమిండియా మరో ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఈ క్రమంలోనే 11 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్ చేరింది. టైటిల్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉంది.

T20 World Cup 2024 Final 3 things India need to do right to beat South Africa

ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్ హోరా హోరీగా సాగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే మూడు విషయాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంది.

1. శివమ్ దూబే సరిగ్గా వాడుకోవాలి..
స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడే శివమ్ దూబేను సరిగ్గా వాడుకోవాలి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్ వేసే సమయంలో అతన్ని బ్యాటింగ్‌‌కు పంపించాలి. సెమీఫైనల్లోనే శివమ్ దూబేను కాకుండా రవీంద్ర జడేజాను ముందుగా పంపించి ఘోర తప్పిదం చేశారు. ఈ క్రమంలోనే స్పిన్ బౌలింగ్‌‌ను సమర్థవంతంగా ఆడే శివమ్ దూబే‌ను వ్యూహాత్మకంగా పంపించాలి.

2. ఒత్తిడి లేకుండా ఆడాలి..
ఫైనల్లో విజయం సాధించాలంటే టీమిండియా ముందుగా చేయాల్సింది ఒత్తిడిని దరి చేయనివ్వవద్దు. ఆటను ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. భుజాలు తడిమేయకుండా ఆఖరి బంతి వరకు పోరాటం చేయాలి. ముఖ్యంగా పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడాలి. సెమీఫైనల్లో ఎలా ఆధిపత్యం చేయించారో అలానే దూకుడు కొనసాగించాలి.

3. అటాకింగ్ గేమ్ ఆడాలి..
సౌతాఫ్రికా స్టార్ బౌలర్లు మార్కో జాన్సెన్, టబ్రైజ్ షంసీ‌లపై భారత బ్యాటర్లు అటాకింగ్ గేమ్ ఆడాలి. మొదటి నుంచి వారిపై హిట్టింగ్ చేసి ఒత్తిడికి గురి చేయాలి. సహజంగా సఫారీ ఆటగాళ్లు కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురవుతారు. దాన్ని టీమిండియా క్యాష్ చేసుకోవాలి.

Story first published: Saturday, June 29, 2024, 18:14 [IST]
Other articles published on Jun 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+