Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: నిప్పులు చెరిగిన కమిన్స్.. ఇంగ్లండ్‌పై ఆసీస్ ఘన విజయం!

టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా తన జోరును కొనసాగిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో శనివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 36 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు కావడంతో హోరాహోరీ పోరు తప్పదని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఆసీస్ టాప్-5 బ్యాటర్లు సత్తా చాటడంతో ఆసీస్‌కు భారీ స్కోర్ దక్కింది.

T20 World Cup 2024 David Warner Pat Cummins Guide Australia To Victory Over England

ట్రావిస్ హెడ్(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), డేవిడ్ వార్నర్(16 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39), మిచెల్ మార్ష్(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), గ్లేన్ మ్యాక్స్‌వెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28), మార్కస్ స్టోయినీస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్(2/44) రెండు వికెట్లు తీయగా.. మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులే చేసి ఓటమిపాలైంది. జోస్ బట్లర్(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), హ్యారీ బ్రూక్(16 బంతుల్లో 2 ఫోర్లతో 20 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్(2/23), ఆడమ్ జంపా(2/28) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్‌వుడ్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు. ఆడమ్ జంపా, కమిన్స్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.

ఈ గెలుపుతో గ్రూప్-బీలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ ఓటమితో ఇంగ్లండ్.. తమ సూపర్-8 ఆశలను సంక్లిష్టం చేసుకుంది. స్కాంట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్వవ్వడం.. ఆసీస్ చేతిలో ఓడిపోవడం ఇంగ్లండ్ కొంపముంచింది. తమ చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో మెరుగైన విజయం సాధించడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఇంగ్లండ్ సూపర్ 8 అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Story first published: Sunday, June 9, 2024, 7:56 [IST]
Other articles published on Jun 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+