For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2024: భారత్‌తో మ్యాచ్.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్! ఆ స్టార్ బ్యాటర్ ఔట్!

'మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఉంది' పాకిస్థాన్ జట్టు పరిస్థితి. టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అమెరికా చేతిలో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఇమాద్ వసీం గాయంతో మెగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్న ఇమాద్ వసీం.. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌ ఆడలేదు. ఆదివారం న్యూయార్క్ వేదికగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ ఆడేందుకు ఇమాద్ వసీం పెయిన్ కిల్లర్స్, ఇంజెక్షన్స్ తీసుకున్నట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అయితే అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని, భారత్‌తో మ్యాచ్ అనంతరం అతన్ని స్వదేశం పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

T20 World Cup 2024 Big blow for Pakistan as Imad Wasim likely to be ruled out ahead of IND vs PAK

స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న మెహ్రాన్ ముంతాజ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, లాహోర్‌లోని ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడని పాక్ మీడియా పేర్కొంది. ఇమాద్ వసీం స్థానంలో ముంతాజ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇమాద్ వసీం గైర్హాజరీలో భారత్‌తో మ్యాచ్‌లో సయిమ్ ఆయూబ్, మహమ్మద్ రిజ్వాన్‌లు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.

అమెరికాతో మ్యాచ్ సందర్భంగా భవిష్యత్తు మ్యాచ్‌ల నేపథ్యంలోనే ఇమాద్ వసీమ్‌ను తుది జట్టులోకి తీసుకోలేదని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. మిగతా మ్యాచ్‌లకు అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్ 2024ను పాకిస్థాన్ ఓటమితో ప్రారంభించింది. పసికూన అమెరికాతో సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో పాకిస్థాన్ తమ సూపర్ -8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సూపర్ -8 చేరాలంటే ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ గెలవడం తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో ఓడితే దాదాపు పాక్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.

మరోవైపు ఐర్లాండ్‌పై విజయం సాధించి జోరు మీదున్న టీమిండియా పాక్‌ను ఓడించి తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటోంది.

పాకిస్థాన్ వరల్డ్ కప్ టీమ్:
బాబర్ ఆజామ్, అబ్రర్ అహ్మద్, ఆజామ్ ఖాన్, ఫకార్ జమాన్, హ్యారీస్ రౌఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహమ్మద్ అమీర్, మహమ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ ఆయుబ్, షాదాబ్ ఖాన్, షాహిన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్

Story first published: Saturday, June 8, 2024, 19:24 [IST]
Other articles published on Jun 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+